నా రాజీనామాతోనే మునుగోడు అభివృద్ధి చెందింది: రాజగోపాల్‌ రెడ్డి

సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామాతోనే మునుగోడు అభివృద్ధి చెందిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ డబ్బులు పంచి తన అభ్యర్థిని గెలిపించుకున్నారని రాజగోపాల్‌ రెడ్డి విమర్శించారు.

New Update
నా రాజీనామాతోనే మునుగోడు అభివృద్ధి చెందింది: రాజగోపాల్‌ రెడ్డి

నేను రాజీనామా చేస్తే కానీ ముఖ్యమంత్రికి మునుగోడు గుర్తు రాలేదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌పై ఫైర్‌ అయిన రాజగోపాల్‌ రెడ్డి.. తాను రాజీనామా చేస్తేనే కేసీఆర్‌కు గట్టుప్పల్‌ మండలాన్ని అభివృద్ధి చేయాలనే సోయి వచ్చిందని మండిపడ్డారు. మునుగోడులో బైపోల్స్ జరిగిన ఏడాది తర్వాత ఎన్నికలు వస్తుండటంతో కేసీఆర్‌ చండూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించారన్నారు. కేసీఆర్‌ చేసే ప్రతీ పని రాజకీయ లబ్ది కోసమే చేస్తున్నారని విమర్శించారు. ఇందులో భాగంగానే కేసీఆర్‌ చండూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించారన్నారు.

సీఎం కేసీఆర్‌ గతంలో చండూరును రెవెన్యూ డివిజన్‌గా ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయ లబ్ది కోసమే ఇదంతా చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్‌ సవాలక్ష హామీలు ఇచ్చారన్న ఆయన.. కనీసం దీనినైనా నెరవేర్చినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం మునుగోడు నియోజకవర్గంలో ఎంతమందికి దళిత బంధు డబ్బులు ఇచ్చారో చెప్పాలన్నారు. ఎంద మంది పేలకు డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్లు నిర్మించి ఇచ్చారో చెప్పాలన్నారు. కేసీఆర్‌ కుటుంబం అంటేనే పెద్ద అవినీతి కుటుంబం అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌ అవినీతి గురించి తాము ప్రజలకు వివరిస్తున్నామన్నారు. కేసీఆర్‌ గతంలో డబ్బులు ఇచ్చి తన అభ్యర్థిని గెలిపించున్నాడన్న ఆయన.. ఇకపై అలాంటివి జరగవని ప్రజలకు నిజా నిజాలు తెలిసి పోయాయన్నారు. రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్‌.. 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్‌పై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో రైతులకు 12 గంటలకు మించి విద్యుత్‌ రావడం లేదన్నారు. కేసీఆర్‌ విద్యుత్‌పేరుతో కూడా స్కామ్‌లకు పాల్పడున్నారని రాజగోపాల్‌ రెడ్డి మండిపడ్డారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు