Telangana: కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

రైతు బాసటగా కేసీఆర్ మరో ఉద్యమానికి బయలుదేరారు. ఇందులో భాగంగా జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటనకు బయలు దేరిన కేసీఆర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. మొండ్రాయి చెక్ పోస్ట్ దగ్గర ఆయన వెళుతున్న బస్సును ఆపి తనిఖీలు నిర్వహించారు.

New Update

రైతులను కలుస్తున్న కేసీఆర్..

ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు గులాబీ బాస్ రంగంలోకి దిగారు. సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎండిన పంట పొలాలను పరిశీలించి నివేదికను అందించడంతో పాటూ క్షేత్రస్థాయిలో కేసీఆర్ పర్యటించి రైతులకు భరోసా కల్పించాలని అభ్యర్ధించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కేసీఆర్ నల్లగొండ జిల్లా బస్సు యాత్ర చేస్తున్నారు. రైతులను స్వయంగా కలిసి వారి కష్టసుఖాలను తెలుసుకుంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు