DK Aruna: సెప్టెంబర్‌ 17న కేసీఆర్‌ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్‌ చేశారు.

DK Aruna: సెప్టెంబర్‌ 17న కేసీఆర్‌ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
New Update

రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్‌ చేశారు. బీజేపీ పార్టీ పిలుపు మేరకు జోగులాంబ గద్వాలా జిల్లా కేంద్రంలో బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న డీకే అరుణ అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ గత 10 ఏళ్ల నుంచి తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని జరపడం లేదన్నారు. మరోవైపు తెలంగాణ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ముద్రించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చడం ద్వారా రాబోయే తరాల వారికి తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన పొరాటాలు, తొలిదశ, మళిదశ ఉద్యమాల గురించి తెలుసుకునే అవకాశం ఉందన్నారు.

మరోవైపు సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆరుణ.. కేసీఆర్‌ జూన్‌ 2న జాతీయ జెండా ఏగరవేయడానికి సిద్థంగా ఉంటాడని విమర్శించారు. నిజాం పాలన నుంచి తెలంగాణను అప్పటి భారత ప్రభుత్వం ఎలా కాపాడుకుందో కేసీఆర్‌కు తెలియదన్నారు. కేసీఆర్‌కు రాష్ట్రాన్ని దోచుకోవడం మాత్రమే తెలుసన్నారు. కేసీఆర్ గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో చేయని అవినీతి లేదన్నారు. రాష్ట్రంలో అమలు అవుతున్న ప్రతీ పథకంలో అవినీతే ఉందన్నారు. కాళేశ్వరం, 24 గంటల విద్యుత్‌, మిషన్‌ కాకతీయ, మిషన్ భగీరథ ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్‌ అవినీతి రామాయణం అంత పెద్దగా ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌ సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దీనోత్సవాన్ని అధికారికంగా జరుపకపోతే ప్రజలే కేసీఆర్‌ను అధికారం నుంచి తొలగిస్తారని డీకే అరుణ జోస్యం చెప్పారు. కేసీఆర్‌ లబ్దిదారులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ఇంతవరకు ఎందుకు పంపిణీ చేయలేదని ఆమె ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నేతలు తమ సహచరులకే డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్లను పంపిణీ చేస్తున్నారన్నారు. దీంతో అసలైన లబ్దిదారులకు న్యాయం జరగడం లేదన్నారు. మరోవైపు దళిత బంధు డబ్బులను సైతం బీఆర్‌ఎస్‌ నేతలు అనుచరులకు తెలిసిన వారికి మాత్రమే ఇస్తున్నారని డీకే అరుణ పేర్కొన్నారు.

#brs #telangana #bjp #cm-kcr #dk-aruna #september-17 #liberation-day
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe