ప్రముఖ కమెడియన్ జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తూ నిర్మించిన తాజా చిత్రం ‘కేసీఆర్’. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ వాయిదాపడింది. తెలంగాణలో ఈ నెలలోనే పోలింగ్ జరగనుండగా పొలిటికల్ బేస్డ్ సినిమాలకు సెన్సార్ నో చెబుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఆర్జీవీ ‘వ్యూహం’ సైతం ఇంకా సెన్సార్ పూర్తి కాకపోగా.. తాజాగా రాకేష్ మూవీ ‘KCR’ కూడా సెన్సార్ ఆపేశారట. ప్రస్తుతం ఈ సినిమాను విడుదల చేయడానికి వీలులేదని ఈసీ అధికారులు చెప్పేశారట. దీంతో చాలా డిజప్పాయింట్ అయిన కేసీఆర్ ప్రేక్షకుల కోసం ప్రత్యేక వీడియో షేర్ చేశారు రాకేష్.
View this post on Instagram
ఈ మేరకు ‘ఏది జరిగినా మన మంచికే. మీ ఆశీస్సులతో’ అంటూ ఓ వీడియోను ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసిన రాకేష్.. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు. ఈ టైంకే సినిమా రిలీజ్ చేద్దామని పక్కా ప్లాన్‌తో ఉన్నాం. కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి కొన్ని ఆర్డర్లు వచ్చాయి. ఇది బయోపికా? ఇది ఏ జానర్ అని రివీల్ చేయడం లేదు. సినిమా గురించి ఏమీ రివీల్ చేయడం లేదు. సెన్సార్ వారికి అన్నీ వివరించాను. ఎన్నికల కోడ్ ప్రకారం ఈ సినిమాను ఇప్పుడు రిలీజ్ చేయకూడదట. ఏది జరిగినా మన మంచికే అని అనుకుంటున్నా. పబ్లిసిటీ చేయడానికి టైం దొరికిందని అనుకుంటాను. మీరంతా నా ప్రతీ పోస్టుకు లైక్ కొట్టండి. ప్రమోట్ చేయండి. నాకు ఎవ్వరూ డబ్బులిచ్చి ఈ సినిమాను చేయమని చెప్పలేదు. సినిమా మీద ప్యాషన్‌తో నా డబ్బులతో నేను తీసుకున్నాను. దీన్ని మీరు గౌరవిస్తున్నారని కోరుకుంటున్నానంటూ చెప్పుకొచ్చారు.
Also read :మృణాల్ ఠాకూర్‌తో లవ్ ఎఫైర్.. ఎట్టకేలకు నిజం చెప్పేసిన సింగర్ బాద్‌షా
ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ తదితర విషయాల వెల్లడించిన రాకేష్.. ఎన్నికల ముందే రిలీజ్ చేసేందుకు చాలా వేగంగా చిత్రీకరణ జరిపినట్లు తెలిపారు. ఏది ఏమైనా సినిమా కచ్చితంగా వస్తుందని, అద్భుతమైన కథతో రాబోతున్న మూవీ అందరికీ నచ్చుతుందన్నారు. ఈ సినిమా విషయంలో చాలా విమర్శులు ఎదుర్కొన్నట్లు తెలిపిన ఆయన.. ఇదంతా తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో తీసిందని, ఎవ్వరూ తనకు డబ్బులివ్వలేదని క్లారిటీ ఇచ్చారు. మూవీని టీఆర్ఎస్ నిర్మిస్తోందని, వారికి బినామీగా ఉన్నానంటూ వచ్చిన రూమర్స్ ను కొట్టిపారేశారు.