MP Laxman serious Comments on KCR: సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ పార్టీ ఆపీస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్ 22 శాతానికి తగ్గించాడని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill) గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 50 శాతం మంది మహిళలు ఉన్నారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. కానీ కేసీఆర్ (CM KCR) మాత్రం తన క్యాబినెట్‌లోకి ఒక మహిళా మంత్రిని మాత్రమే తీసుకున్నారన్నారు. అలాంటి వ్యక్తికి మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.
మరోవైపు ఎమ్మెల్సీ కవితపై ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయాలని అంటున్నారన్నారు. మహిళా రిజర్వేషన్ కోసం గతంలో కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసినట్లు గుర్తు చేసిన ఆయన.. కవిత (Kavitha) దీనికోసం ముందుగా ప్రగతి భవన్ ముందు ధర్నా చేయాలని సూచించారు. కేసీఆర్ మంత్రి వర్గంలో మహిళలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదో నిలదీయాలన్నారు. బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్‌ను 22 శాతానికి ఎందుకు తగ్గించారో ప్రశ్నించాలన్నారు. అంతేకానీ కేంద్ర ప్రభుత్వంపై పదే పదే నిందలు వేయవద్దని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ హితువు పలికారు.
సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని (Telangana Liberation Day) అధికారికంగా నిర్వహించాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ జూన్ 2న జాతీయ జెండా ఏగరవేయడానికి సిద్థంగా ఉంటాడని విమర్శించారు. నిజాం పాలన నుంచి తెలంగాణను అప్పటి భారత ప్రభుత్వం ఎలా కాపాడుకుందో కేసీఆర్‌కు తెలియదన్నారు. కేసీఆర్‌కు రాష్ట్రాన్ని దోచుకోవడం మాత్రమే తెలుసన్నారు. కేసీఆర్ గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో చేయని అవినీతి లేదన్నారు. రాష్ట్రంలో అమలు అవుతున్న ప్రతీ పథకంలో అవినీతే ఉందన్నారు. కాళేశ్వరం, 24 గంటల విద్యుత్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ అవినీతి రామాయణం అంత పెద్దగా ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read: నా చిన్ననాటి బస్సు దొంగతనం అయింది.. పోలీసులకు ఆనంద్ మహీంద్ర ఫిర్యాదు