Kate Middleton: మరో వివాదంలో కేట్‌ మిడిల్టన్‌..వివాదంలో తాజా చిత్రం!

బ్రిటన్ యువరాణి కేట్‌ మిడిల్టన్‌ కు సంబంధించి మరో ఫోటో విమర్శల పాలైంది.తాజాగా కేట్ మిడిల్టన్‌కు చెందిన మరో ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఫొటో కూడా మార్ఫింగ్ ఫొటో అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Kate Middleton: మరో వివాదంలో కేట్‌ మిడిల్టన్‌..వివాదంలో తాజా చిత్రం!
New Update

Kate Middleton: బ్రిటన్ యువరాణి కేట్‌ మిడిల్టన్‌ కు సంబంధించి మరో ఫోటో విమర్శల పాలైంది. ఇంతకు ముందు ఓ ఆమె మదర్స్‌ డే సందర్భంగా తన పిల్లలతో దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో పెట్టగా..అది నకిలీ ఫొటో అంటూ నెట్టింట విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. దీంతో జరిగిన పొరపాటును అధికారికంగా అంగీకరించి క్షమాపణ చెప్పారు. తాజాగా కేట్ మిడిల్టన్‌కు చెందిన మరో ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఫొటో కూడా మార్ఫింగ్ ఫొటో అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.

దీనిపై బ్రిటన్ రాజు కుటుంబం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి .బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌ పెద్ద కోడలు, ప్రి‍న్స్‌ విలియమ్‌ సతీమణి.. వేల్స్‌ యువరాణి కేట్‌ మిడిల్టన్‌ చాలా రోజులు నుంచి బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. యువరాణి ఏమయ్యారంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇక అనంతరం ఆమె ఆరోగ్యంపై అధికారిక ప్రకటన వచ్చింది. కేట్ మిడిల్టన్ కేన్సర్‌తో బాధపడుతున్నారని.. శస్త్ర చికిత్స జరిగిందని.. కోలుకుని త్వరలో వస్తారని ప్రకటన వచ్చింది. కేన్సర్ ప్రకటన వెలువడిన ఇన్నాళ్లకు కేట్ మిడిల్టన్‌కు చెందిన మరో చిత్రం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులో ఓ చెట్టు దగ్గర నిలబడినట్లుగా ఉన్న చిత్రాన్ని విడుదల చేశారు. ఇప్పుడు ఇది కూడా మార్ఫింగ్ ఫొటో అంటూ విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపై రాజు కుటుంబం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

Also read: నెల రోజుల పాటు రైళ్లు బంద్‌!

#britan #fake #photo #viral #katemiddilton #prince
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe