Karnataka: ఎస్‌బీఐ, పీఎన్‌బీలు కట్..కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం

నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఎస్‌బీఐ, పీఎన్‌బీ బ్యాంకులో లావాదేవీలను నిలిపివేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ బ్యాంకుల్లో ఉన్న అన్ని ఖాతాలను మూసి వేయాలని ఆర్డర్ పాస్ చేసింది.

New Update
PM Modi : మోదీ.. ప్రజల మనోభావాలు రెచ్చగొడుతున్నారు : సిద్ధరామయ్య

SBI, PNB Transactions: కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లతో అన్ని లావాదేవీలను నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బ్యాంకుల్లో ఉన్న అన్ని ఖాతాలను మూసి వేసి...డిపాజిట్లను వెంటనే రికవరీ చేయాలని అన్ని ప్రభుత్వం శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న కారణంగానే ఈ నిర్ణయం కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు, బోర్డులు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఇంకా ఇతర సంస్థలు ఈ రెండు బ్యాంకుల నుంచి తమ డిపాజిట్లు, పెట్టుబడులను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త డిపాజిట్లను చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.

కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి వ్యవహారంలో స్టేట్ బ్యాంక్..పరిశ్రమల అభివృద్ధి మండలికి సంబంధించిన వ్యవహారంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిధులు దుర్వినియోగం చేశాయని ఆరోపణలు ఉన్నాయి. దాంతో పాటూ హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు, సహకార బ్యాంకు ఖాతాల్లోకి 88.62 కోట్ల రూ.లను బదిలీ చేసి..ప్రభుత్వ నిధుల్లో రూ.187 కోట్లకు సంబంధించిన అనధికార లావాదేవీలు ఈ రెండు బ్యాంకులు జరిపించాయని సిద్ధరామయ్య ప్రభుత్వం ఆరోపిస్తోంది.

Also Read: Russia-Ukraine War: రష్యా – ఉక్రెయిన్ సరిహద్దుల్లో హై అలెర్ట్‌..

Advertisment
Advertisment
తాజా కథనాలు