ఈమధ్య కాలంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఎయిర్‌పోర్టులు, విద్యాసంస్థలు, ప్రముఖులను లక్ష్యంగా చేసుకోని కొందరు ఆకతాయిలు ఇలా బెదింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి బెదిరింపులు వచ్చినప్పుడు పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తం అవుతాయి. ఆ తర్వాత బాంబు బెదిరింపు బూటకమని తేలుస్తాయి. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. అయితే తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇటీవలే బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇలా బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది.
Also read: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ అప్పుడేనా.. !
కర్ణాటక అంతటా బాంబులు పేడతాం
తమకు రూ.20 కోట్లు ఇవ్వకపోతే.. కర్ణాటక అంతటా బస్సులు, రైళ్లు, దేవాలయాలు, హోటల్లు వంటి బహిరంగ ప్రదేశాలల్లో పేలుళ్లు జరుపుతామని.. హెచ్చరికలు చేశారు. దీనిపై బెంగళూరు సీటీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అలాగే బాంబ్ స్క్వాడ్‌లతో సహా పోలీసులు తనిఖీలు చేపట్టారు.
బస్సులో బాంబు పేల్చబోతున్నాం
' సినిమా ట్రైలర్‌పై మీ అభిప్రాయం ఏంటి. మీరు మారు 2.5 మిలియన్ డాలర్లు ఇవ్వకపోతే.. కర్ణాటక వ్యాప్తంగా బస్సులు, రైళ్లు, ఆలయాలు, హోటళ్లు వంటి ప్రదేశాల్లో పెద్ద ఎత్తున పేలుళ్లు చేస్తాం. మేము మరో ట్రైలర్ మీకు చూపించాలనుకుంటున్నాం. అంబారీ ఉత్సవ్ బస్సులో బాంబు పేల్చబోతున్నాం. అంబారీ ఉత్సవ్ బస్సు పేలుడు జరిగిన తర్వాత మా డిమాండ్లను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాం. మీకు పంపిన మెయిల్ స్క్రీన్‌షాట్‌లను అందులో అప్‌లోడ్ చేస్తాం. మా తర్వాతి పేలుడు గురించి త్వరలో ట్వీట్ చేస్తామని' మెయిల్‌లో తెలిపారు.
Also Read: నీరు వృథా చేస్తే రూ.5 వేలు ఫైన్.. ఎక్కడంటే