TDP-Janasena First List: ఇది కాపు జాతికే అవమానం.. జనసేనానిపై రగిలిపోతున్న కుల పెద్దలు!

జనసేనకు 24 స్థానాలు కేటాయించడంపై కాపు కుల పెద్దలు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న కాపు జాతి మొత్తాన్ని అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే కాపు జాతి సహకరించదంటూ హెచ్చరిస్తూ.. పవన్ ను చంద్రబాబు వాడుకుని వదిలేస్తాడంటూ రగిలిపోతున్నారు.

TDP-Janasena First List: ఇది కాపు జాతికే అవమానం.. జనసేనానిపై రగిలిపోతున్న కుల పెద్దలు!
New Update

Kapu Leaders on Janasena 24 Seats: ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections 2024) జనసేనకు 24 స్థానాలు మాత్రమే కేటాయించడం పట్ల కాపు కుల పెద్దలు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న కాపు జాతి మొత్తాన్ని అవమానించేలా జనసేనకు (Janasena) సీట్ల కేటాయింపు ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన పవన్ (Pawan Kalyan) వెంటనే స్పందించాలని కాపు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 24 సీట్లు మాత్రమే ఇస్తానంటే జనసేనకు కాపు జాతి సహకరించదంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో తీవ్రస్థాయిలో రగిలిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు వాడుకుని వదిలేస్తాడని, సీట్ల సంఖ్య పెంచకపోతే టీడీపీకి (TDP) ఓటు వేసేదే లేదని తేల్చి చెబుతున్నారు.

వెక్కివెక్కి ఏడ్చిన సూర్య చంద్ర..
ఈ మేరకు టీడీపీ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కాపు కుల సంఘాల నేతల ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 11 సీట్లు ఉండగా టీడీపీకి-9, జనసేనకు-2 ప్రకటించండం, కోనసీమ జిల్లా పి.గన్నవరంలో టీడీపీ టికెట్ మహాసేన రాజేష్‌కి ఇవ్వడంపై లోకల్ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట టికెట్ జ్యోతుల నెహ్రుకు (Jyothula Nehru) కేటాయించడంతో జనసేన ఇన్‌ఛార్జ్‌ పాటంశెట్టి సూర్యచంద్ర (Patamsetti Suryachandra) వెక్కివెక్కి ఏడ్చారు. రాత్రంతా హంగామా సృష్టించారు. కుటుంబ సభ్యులతో సహా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. రాత్రంతా స్థానికి గుడిలోనే కూర్చుని దీక్ష చేపటట్టారు.

ఇది కూడా చదవండి : YSR Rythu Bharosa: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. మూడురోజుల్లో సున్నా వడ్డీ రాయితీ జమ!

చలో విజయవాడ..
మరోవైపు తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో బొజ్జల సుధీర్‌ (Bojjala Sudheer) మనస్తాపానికి గురయ్యారు. చివరి లిస్ట్‌లో అయినా తన పేరు ఉంటుందని నమ్ముతున్నట్లు తెలిపారు. శ్రీకాళహస్తిలో బొజ్జల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉండగా.. వైసీపీని ఎదుర్కొనే సత్తా తనకు మాత్రమే ఉందని సుధీర్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయరని, టికెట్‌ ఇస్తే తనకే ఇవ్వాలని చంద్రబాబుకు చెప్పినట్లు గుర్తు చేశారు. అలాగే అన్నమయ్య జిల్లాలోనూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తంబళ్లపల్లె సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీటు అమ్ముకున్నాడని ఆరోపించారు. కష్టపడ్డ వారికి పార్టీలో విలువ లేదన్నారు. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమైన మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలు ఇవాళ మధ్యాహ్నం శంకర్‌ యాదవ్‌ అనుచరులతో కలిసి చలో విజయవాడ ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు.

#pawan-kalyan #tdp #chandrababu #ap #kapu-leaders #24-seats-janasena
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe