Kangana Ranaut: భారత తొలి ప్రధాని 'సుభాష్ చంద్రబోస్' అన్న కంగనా.. నెటీజన్లు ఫైర్ ఓ వార్తా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి, బీజేపీ మండి ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్.. మన దేశ తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ఆమెపై సోషల్ మీడియాలో విపక్ష నేతలు, నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By B Aravind 05 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి దేశంలో జరిగే వివాదాలపై తనదైన శైలీలో స్పందిస్తుంటారు బాలీవూడ్ నటీ కంగనా రనౌత్. గత కొంత కాలంగా ఆమె బీజేపీకి అనుకూలంగా ఉంటూ పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఈసారి జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ కంగనాకు ఎంపీ టికెట్ కూడా ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగనున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. భారత తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. Also Read: పాంచ్ న్యాయ్-పచ్చీస్ గ్యారెంటీస్..కాంగ్రెస్ సంచలన మేనిఫెస్టో 'టైమ్స్ నౌ' వార్తా సంస్థ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో కంగనా పాల్గొన్నారు. 'మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు తొలి ప్రధాని బోస్ ఎక్కడికి వెళ్లారు ?. దేశం కోసం పోరాడిన ఆయన్ని దేశంలోకి అడుగుపెట్టనివ్వలేదని' ఆమె వ్యాఖ్యానించారు. దీంతో వ్యాఖ్యాత.. కంగనా మాటలను సరిచేశారు. అయితే ప్రస్తుతం కంగనా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో విపక్ష నేతలు, నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె విద్యాశాఖ మంత్రి అయితే పరిస్థతి అంటూ కామెంట్లు పెడుతున్నారు. भारत के पहले प्रधानमंत्री सुभाष चंद्र बोस थे. - कंगना, BJP उम्मीदवार कंगना में PM बनने के सारे गुण नजर आ रहे. pic.twitter.com/XiQRgpxJSb — Ranvijay Singh (@ranvijaylive) April 4, 2024 మరోవైపు కంగనా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. 'నార్త్ నుంచి ఒక బీజేపీ అభ్యర్థి.. సుభాష్ చంద్రబోస్ మన తొలి ప్రధాని అని అంటారు. సౌత్ నుంచి మరో బీజేపీ నేత మన మొదటి ప్రధాని మహాత్మ గాంధీ అని అంటారు. వీళ్లందరు ఎక్కడి నుంచి గ్రాడ్యూయేట్ అయ్యారు' అంటూ విమర్శించారు. ఇదిలాఉండగా.. మండి నియోజకవర్గానికి జూన్ ఒకటిన ఓటింగ్ జరగనుంది. రాజవంశీయులకు కంచుకోటైన ఈ నియోజకవర్గంలో కంగనా రనౌత్ పోటీ ఆసక్తిగా మారింది. One BJP candidate from North says Subash Chandra Bose was our first PM !! And another BJP leader from South says Mahatma Gandhi was our PM !! Where did all these people graduate from? 😁 — KTR (@KTRBRS) April 5, 2024 Also Read: ఐపీఎల్ టికెట్ల కోసం ఆన్ లైన్లో మోసపోయిన మహిళ! #telugu-news #national-news #lok-sabha-elections #kangana-ranaut #subhas-chandra-bose మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి