Kalki 2898AD Trailer : టాలీవుడ్ (Tollywood) యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కల్కి '2898AD'. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'కల్కి' ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితమే విడుదలైంది. తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది.
ముఖ్యంగా ట్రైలర్లో విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. కల్కి ట్రైలర్ (Kalki Trailer) చూస్తున్నంత సేపు ఓ హాలీవుడ్ మూవీ ట్రైలర్ ని చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతోంది. ఆ రేంజ్ లో విజువల్స్ ఇంప్రెస్ చేశాయి. ఇక భైరవ పాత్రలో ప్రభాస్ యాక్షన్, డైలాగ్స్ అదరగొట్టేసారు. సంతోష్ నారాయణన్ బీజీఎం ట్రైలర్ మొత్తానికి హైలెట్ గా నిలిచింది.
#Kalki2898ADTrailer premiering shortly…https://t.co/XTn2LkCRCM
— Kalki 2898 AD (@Kalki2898AD) June 10, 2024
Also Read : ‘కల్కి’ లో విలన్ కమల్ హాసన్ కాదట.. ప్రభాస్ ను ఢీ కొట్టేది ఎవరంటే?
ఇక సినిమాలో గెస్ట్ రోల్స్ లో కనిపించిన అమితాబ్, దీపికా పదుకొనే, దిశా పటాని తదితరులు ట్రైలర్ లో డిఫరెంట్ గెటప్స్ తో అదరగొట్టేశారు. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ తన మేకింగ్ తో ఆడియన్స్ ని ఓ కొత్త ప్రపంచానికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా 'కల్కి' ప్రభాస్ కెరియర్ లోనే ఓ మైల్ స్టోన్ మూవీగా మిగిలిపోవడం పక్కా అని చెప్పొచ్చు.