Tirupati : ఎన్నికల ప్రచార(Election Campaign) గడువు ఈరోజుతో ముగిసిపోనుంది. అధికార, విపక్ష పార్టీల నేతలు చివరి రోజు కావడంతో హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నారు. అయితే బీజేపీ(BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. తిరుపతి ఒక గొప్ప పుణ్యక్షేత్రమని.. ప్రధాని మోదీ ఈ నగరాన్ని ఐటీ కేంద్రంగా తీర్చుదిద్దుతానని అన్నారని చెప్పారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో యువతకు ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని పేర్కొన్నారు.
Also Read: ఏపీలో 4 కోట్ల 14 లక్షల 1,887 మంది ఓటర్లు
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతితో పాటు రాయలసీమ(Rayalaseema) ప్రాంతంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని ఆ పార్టీ నేత నారా లోకేశ్ అన్నారు. రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ అంటూ విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని అన్నారు. జగన్ పాలనలో కొత్త కంపెనీలు రాకపోవడమే కాదు.. ఉన్న కంపెనీలు తరలిపోయాయంటూ సైటైర్లు వేశారు. తిరుపతిలో ఎటు చూసినా భూకబ్జాలు, దందాలు జరుగుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అసెంబ్లీ అభ్యర్థి అయిన ఆరణి శ్రీనివాసులు, ఎంపీ అభ్యర్థి వరప్రసాద్‌లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.