Voters List In AP : ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ఈనెల 13న పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్ల 14 లక్షల ఒక వేయి 887 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2 కోట్ల 3 లక్షల 39 వేల 851, మహిళలు 2 కోట్ల 10 లక్షల 58 వేల 615 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు 3 వేల 421, సర్వీసు ఓటర్లు 68 వేల 185 మంది ఉన్నారు. ఈ ఏడాది కొత్తగా 5.94 లక్షల మంది ఓటర్లు(Voters) చేరారు. పురుషుల కంటే 7.18 లక్షల మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ప్రకాశం మినహా అన్ని జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా కనిపించారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20.56 లక్షల మంది ఓటర్లు, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 7.71 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh : ఏపీలో 4 కోట్ల 14 లక్షల 1,887 మంది ఓటర్లు
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి నడుస్తోంది. నేతలు ప్రచారాలు అంటూ ఊదరగొడుతుంటే...ఎన్నికల సంఘం ఓటర్లు, పోలింగ్ కేంద్రాల లెక్కలను బటయపెడుతోంది. ఈసీ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 4 కోట్ల 14 లక్షల 1,887 మంది ఓటర్లు ఈసారి ఓటు వేయనున్నారు.
Translate this News: