International: జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్‌ వల్ల మహిళ మృతి..375 కోట్లు చెల్లించాలని చెప్పిన కోర్టు

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి అమెరికా కోర్టు బాగా బుద్ధి చెప్పింది. ఆ కంపెనీ పౌడర్‌ వల్ల చనిపోయిన ఓ మహిళ కుటుంబానికి 40 మిలియన్ డాలర్లు అంటే 375 కోట్లు ఇవ్వాలని ఆదేశించింది.

International: జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్‌ వల్ల మహిళ మృతి..375 కోట్లు చెల్లించాలని చెప్పిన కోర్టు
New Update

Johnson And Johnson Pwoder: జాన్సన్ అండ్ జాన్స్ పౌడర్‌లో కాన్సర్ కారకాలున్నాయని ప్రూవ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. పదేళ్ళ క్రితమే దీని గురించి వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ పౌడర్ వలన తనకు కాన్సర్ సోకిందని అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన థెరిసా గ్రేసియా అనే మహిళ కోర్టులో కేసు కూడా వేశారు. ఇప్పుడు పదేళ్ళ తర్వాత కోర్టు దాని తీర్పును వెలువరించింది. అయితే ధెరిసా ఇప్పుడు బతికి లేరు. ఆమె 2020లోనే ఆమె చనిపోయారు. కానీ కోర్టు తీర్పు మాత్రం ఇప్పుడు వచ్చింది. బాధిత కుటుంబానికి జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అది కూడా ఏకంగా 375 డాలర్లు ఇవ్వాలని చెప్పింది.

పౌడర్ వలన అరుదైన క్యాన్సర్..

జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ వలన థెరిసా మెసోథెలియా అనే అరుదైన క్యాన్సర్‌కు గురయ్యారు. మెసోథెలిమా చాలా అరుదైన కేన్సర్.. ఊపిరితిత్తులు లేదా పొత్తికడుపులోని పొరల్లో ఈ కణాలు పెరుగుతాయి. రాతినారను ఎక్కువగా తాకినప్పుడు, ఆ దుమ్ముని పీల్చినప్పుడో శరీరంలోకి చేరి కేన్సర్‌‌గా మారుతుంది. దీని వలన ఆమె చనిపోయారు కూడా. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆ కంపెనీ, కెన్‌వ్యూ సంస్థల మీద కేసు వేశారు. జే అండ్ జే పౌడర్‌లో ఆస్బెస్టాస్ ఉందని ఆరోపించారు. తురవాత అది కలినికల్లీ కూడా నిరూపితమైంది కూడా. అయితే కంపెనీ మాత్రం ఇప్పటికీ తమ పౌడర్‌లో ఎటువంటి క్యాన్సర్ కారకాలు లేవనే వాదిస్తోంది. దాదాపు వందేళ్ళుగా తమ ఉత్పత్తి వాడుకలో ఉందని అంటోంది. మరోవైపు మరో సంస్థ కెన్‌వ్యూ సంస్థ మాత్రం తమ టాల్కమ్ పౌడర్‌ను ఇక మీదట తయారు చేయమని చెప్పింది. కానీ కోర్టు తీర్పు మీద స్పందించడానికి మాత్రం నిరాకరించింది. జాన్సన్ అండ్ జాన్సన్ అంతర్గత లిటిగేషన్ విభాగం చీఫ్ ఎరిక్ హాస్ మాత్రం దీని స్పందించారు. జ్యూరీ తీర్పుపై అప్పీల్ చేస్తామని తెలిపారు. ఎటువంటి ఆధారం లేకుండా తీర్పు ఇచ్చారని...అందుకే దానిని సవాల్ చేస్తామని వెల్లడించారు.

ఇక అమెరికా, కెనడాల్లో జాన్సన్ అండ్ జాన్సన్పౌడర్ అమ్మకాలను నలిపేశాయి. 2020 నుంచి ది అమల్లో ఉంది. ఈ పౌడర్ అమ్మకాల మీద అక్కడ కోర్టుల్లో ఏకంగా 38 వేలకు పైగా కేసులున్నాయి. మరోవైపు గతేడాది జాన్సన్ అండ్ జాన్స్ తమ ఉత్పత్తులను నిలిపి వేసింది.

Also Read:Movies : తెలుగు ఇండస్ట్రీలో మరో వివాదం.. హరీష్ శంకర్, ఛోటా కె నాయుడు మధ్య గొడవ

#usa #court #verdict #johnson-and-johnson #pwoder
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe