Joe Biden Battle Box Gaffe In Speech : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden).. తన ప్రసంగంలో పలుమార్లు తడబడటం చర్చనీయాంశవుతోంది. ఆయన ఆరోగ్యం సరిగా లేదనే ఆరోపణలు బలంగా వస్తున్నాయి. అయితే తాజాగా మరోసారి బైడెన్ తడబడ్డారు. ట్రంప్‌పై జరిగిన దాడి నేపథ్యంలో ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తప్పులు మాట్లాడారు. అయితే తమ మధ్య ఉన్న విభేదాలు బ్యాలెట్ బాక్సులో పరిష్కరించుకుంటాం అని చెప్పాల్సి ఉండగా.. బ్యాటిల్ బాక్సుల్లో (యుద్ధపు పెటెల్లో) పరిష్కరించుకుంటాం అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న సహాయకులు మరోసారి నోరెళ్లబెట్టారు.
Also read: వేల కోట్ల దొంగ బ్యాంక్ గ్యారంటీలు.. లక్షల కోట్ల ప్రాజెక్టులకు గ్రహణం!
ఇటీవల నాటో కూటమి (NATO Alliance) దేశాల వార్షిక సదస్సు ముగింపు సందర్భంగా బైడెన్ మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. మీరు అధ్యక్ష రేసు నుంచి వెళ్లిపోతే డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ను కమలా హ్యారీస్ ఓడించగలరని భావిస్తున్నారా అని పాత్రికేయులు అడిగారు. దీనికి బైడెన్ స్పందిస్తూ.. అధ్యక్షునిగా పనిచేసే అర్హతు వైస్ ప్రెసిడెంట్ ట్రంప్‌నకు లేకుంటే నేను ఆయన్ని ఆ పదవికి ఎంపిక చేసేవాణ్ని కాదని అన్నారు. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ కమాల హ్యారిస్ (Kamala Harris) అనాల్సి ఉంది. కానీ బైడెన్ తడబడి ట్రంప్ అని అనేశారు. అలాగే ఈ సమావేశానికి ముందు కూడా నాటో కూటమి దేశాల ప్రతినిధులకు బైడెన్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని పరిచయం చేశారు. ఇక్కడ కూడా జెలెన్‌స్కీని ఆహ్వానిస్తూ పుతిన్ అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్నవారందరూ అవాక్కైపోయారు.
Also read: వెక్కి వెక్కి ఏడ్చిన మెస్సీ..!