Messi:వెక్కి వెక్కి ఏడ్చిన మెస్సీ..!

అర్జెంటీనా ఫుట్‌ బాల్‌ స్టార్‌, కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీ వెక్కి వెక్కి ఏడ్చాడు. కోపా అమెరికా ఫుట్‌ బాల్‌ టోర్నీలో భాగంగా కొలంబియాతో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌ లో మెస్సీ గాయపడ్డాడు.నొప్పి ఎక్కువ కావడంతో మ్యాచ్‌ 66 వ నిమిషంలో మెస్సీ గాయం కారణంగా మైదానం నుంచి బయటకు రావాల్సి వచ్చింది.

New Update
Messi:వెక్కి వెక్కి ఏడ్చిన మెస్సీ..!

Messi: అర్జెంటీనా ఫుట్‌ బాల్‌ స్టార్‌, కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీ వెక్కి వెక్కి ఏడ్చాడు. కోపా అమెరికా ఫుట్‌ బాల్‌ టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబియాతో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌ లో మెస్సీ గాయపడ్డాడు. మ్యాచ్‌ జరుగుతున్న 36 వ నిమిషంలో మెస్సీ పాదానికి గాయమైంది.

దీంతో తీవ్రమైన నొప్పితో మెస్సీ మైదానంలో కిందపడిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స చేసినప్పటికీ కూడా మెస్సీకి రిలీఫ్‌ ఇవ్వలేదు. అయినా సరే మెస్సీ అలానే తన ఆటను కొనసాగిస్తూ ఉన్నాడు. మ్యాచ్‌ హాష్‌ టైమ్‌ తర్వాత కూడా స్కోర్‌ లేకపోవడంతో తీవ్రమైన నొప్పిని భరిస్తూనే మెస్సీ తన ఆటను కంటిన్యూ చేశాడు.

అయితే నొప్పి బాగా ఎక్కువ కావడంతో మ్యాచ్‌ 66 వ నిమిషంలో మెస్సీ గాయం కారణంగా మైదానం నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే మైదానాన్ని వీడి..డగౌట్‌ లో కూర్చున్న మెస్సీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కెరీర్‌ లో చిరవి కోపా అమెరికా ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌ ఆడుతున్న మెస్సీ వెక్కి వెక్కి ఏడ్చాడు.

కానీ అభిమానులు మాత్రం అతనికి మద్దతుగా నిలిచారు. మెస్సీ...మెస్సీ అంటూ మైదానం లోనే జేజేలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Also read: సముద్ర గర్భంలో రామసేతు నిజమే: ఇస్రో!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు