Joe Biden Controversial Comments : భారత్, చైనా(China), జపాన్(Japan), రష్యా(Russia) లు జెనోఫోబిక్ దేశాలంటూ విమర్శించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden). ఈదేశాలు రెఫ్యూజీలను అనుమతించవని అన్నారు. అందుకే భారత్ లాంటి దేశాలు వేగంగా అభివృద్ధి చెందడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. వాషింగ్టన్‌లో పార్టీ నిధుల సేకరణ కార్యక్రమంలో జో బైడెన్ పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలను చేశారు. దాంతో పాటూ అమెరికా గురించి కూడా గొప్పగా చెప్పుకున్నారు. అమెరికా..భారత్(America-India), మిగతా దేశాల్లాంటిది కాదని చెప్పారు. అమెరికా విదేశీ వలసదారులను స్వాగతిస్తుందన్నారు. అలా వచ్చిన వారు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యేందుకు కృషి చేస్తున్నారని...అందుకే తమ దేశం ఎప్పుడు అభివృద్ధి పథంలోనే ఉంటుందని చెప్పుకొచ్చారు.
జోబైడెన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.అందులోనూ ప్రస్తుతం భారత్‌లో ఎన్నికల టైమ్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో బైడెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని రాజకీయ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా మిత్ర దేశాలైన భారత్, జపాన్ గురించి బైడెన్ తక్కువ చేసి మాట్లాడం ఏం బాలేదని విమర్శిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు బారతీయుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని చెబుతున్నారు.
Also Read:Party Symbols: బీఆర్ఎస్‌ను వెంటాడుతున్న కారు గుర్తును పోలిన సింబల్స్