Israel-Hamas war:ఒప్పందం పొడిగిస్తే బావుంటుంది-జో బైడెన్

గాజాలో ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉంది. నాలుగు రోజులుగా యుద్ధం లేదు. పగా ఇరువైపులా బందీలు విడుదలతో సంతోషాలు ఉఫ్పొంగుతున్నాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే బావుండును అని కోరుకుంటున్నాయి. ప్రపంచ దేశాలు, ఇంకా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా.

New Update
Israel-Hamas war:ఒప్పందం పొడిగిస్తే బావుంటుంది-జో బైడెన్

ఇజ్రాయెల్-హమాస్ మధ్య తాత్కాలిక శాంతి నెలకొంది ప్రస్తుతం. కాల్పుల విరమణ ఒప్పందంతో బాటూ బందీల విడుదల జరుగుతోంది. అయితే ఇది ఈరోజుతో ముగియనుంది. ఈ క్రమంలో శాంతి ఒప్పందం మరికొన్ని రోజులు లేదా శాశ్వంతగా పొగిడిస్తే బావుండును అన్న అభిప్రాయం అన్నిచోట్లా వ్యక్తం అవుతోంది. ఇదే భావంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా వ్యాఖ్యలు చేశారు. ఒప్పందం పొడిగిస్తే మరింత మంది బందీలు విడుదలయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Also Read:నిలువుగా డ్రిల్లింగ్ మొదలు..నెలఖారుకు కార్మికులు బయటకు వచ్చే ఛాన్స్


అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ కాల్పులను విరమించింది. హమాస్ తమ దగ్గర ఉన్న 58 మంది బందీలను విడిచిపెడతామనిచెబితే ఇజ్రాయెల్ 114 మందిని విడిచిపెట్టింది. ఈ నాలుగు రోజుల్లో గాజాకు మానవతా సహాయం కూడా అందింది. గాజాలో జనాలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయఇతే ప్రస్తుతం ఇజ్రాయెల్ రేపటి నుంచిమళ్ళీ కాల్పులను మొదలుపెడుతుందా అనే భయం అందరినీ పీకుతోంది. దీనిని ఉద్దేశించే బైడెన్... ఈ డీల్ ఎన్నో ప్రాణాలను కాపాడుతోంది. గాజాకు మానవతా సాయం అందుతోంది. ఇది ఇలాగే కొనసాగితే బావుంటుంది...అదే నా లక్ష్యం అంటూ వ్యాఖ్యలు చేశారు. మనందరి లక్ష్యం అదే అని కూడా అన్నారు. మరోవైపు మరోపక్క హమాస్ కూడా ఇదే కోరుకుంటోంది. బందీల విడుదల కోసం ఇజ్రాయెల్‌ సీరియస్‌గా ఉంటే.. ఈ డీల్‌ను పొడిగించొచ్చని హమాస్ తన ప్రకటనలో తెలిపింది.

ఇక యుద్ధం మొదలైన తర్వాత మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిన్న గాజాలో అడుగుపెట్టారు. యుద్ధంలో మునిగి తేలుతున్న తమ సైనికుల్లో నైతిక స్థైర్యం పెంచేందుకే వచ్చానని చెప్పారు. ఇజ్రాయెల్‌ బయట పెట్టిన హమాస్‌ సొరంగం వద్ద తమ కమాండర్లు, సైనికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ మనవి మూడే లక్ష్యాలు. హమాస్‌ అంతం. బందీలందరినీ క్షేమంగా విడిపించడం. భవిష్యత్తులో మరెన్నడూ ఇజ్రాయెల్‌కు ముప్పుగా మారకుండా గాజాను సరిచేయడం అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు