గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్.. తుది ఫలితాల డేట్ ఫిక్స్ తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ ప్రకటన రిలీజైన ఏడాదిలోగా నియామక ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తోంది. దీంతో తుది జాబితాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. By srinivas 23 Nov 2024 in జాబ్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి TGPSC: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ ప్రకటన రిలీజైన ఏడాదిలోగా నియామక ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే 563 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఫిబ్రవరిలో ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పరీక్షల ఆన్సర్ షీట్స్ మూల్యాంకనాన్ని టీజీపీఎస్సీ మొదలుపెట్టగా.. మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేసేందుకు 3 నెలల సమయం పడుతుందని కమిషన్ భావిస్తోంది. ఒక్కో పేపరు రెండుసార్లు మూల్యాంకనం.. ఈ మేరకు ఒక్కో పేపరును రెండుసార్లు మూల్యాంకనం చేస్తారు. ఒక అభ్యర్థికి మొదటిసారి వచ్చిన మార్కులకు.. రెండోదశ మూల్యాంకనంలో వచ్చిన మార్కులకు వ్యత్యాసం లేకుంటే ముందుకు వెళ్తారు. తేడా వస్తే మూడోసారి మూల్యాంకనం చేసి ఫైనల్ మార్క్స్ ప్రకటిస్తారు. ఆ మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ కమిషన్ ఫైనల్ చేస్తుంది. ఇది కూడా చదవండి: వయనాడ్‌లో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ ఇక 563 పోస్టులకు టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ మొత్తం ఉద్యోగాలకు 4,03,645 మంది అప్లై చేసుకున్నారు. జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా క్వాలిఫై అయిన అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో 31,382 మందిని ఎంపిక చేశారు. అయితే మొత్తం 31,403 మంది ప్రధాన పరీక్షలకు హాజరవగా 21,093 మంది మెయిన్స్ పరీక్షలు రాశారు. ఇది కూడా చదవండి: ఏపీలో మరో పొలిటికల్ మర్డర్.. వైసీపీ నేతను గొడ్డలితో నరికి..! #tgpsc #group-1 #result మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి