ఏపీలో మరో పొలిటికల్ మర్డర్.. వైసీపీ నేతను గొడ్డలితో నరికి..!

ఏపీలో మరో పొలిటికల్ మర్డర్ అటెంప్ట్ ఘటన సంచలనం రేపుతోంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన వైసీపీ నేత ఈశ్వర్ రెడ్డిపై భూ వివాదంలో ప్రత్యర్థులు గొడ్డలితో దాడిచేశారు. ఈశ్వర్ రెడ్డి ప్రస్తుతం నర్సరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

New Update
rereer

AP Crime: ఏపీలో మరో పొలిటికల్ మర్డర్ అటెంప్ట్ ఘటన సంచలనం రేపుతోంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన వైసీపీ నాయకుడు ఈశ్వర్ రెడ్డిపై ప్రత్యర్థులు గొడ్డలితో దాడిచేసి తీవ్రంగా గాయపరచారు. ఈశ్వర్ రెడ్డి ప్రస్తుతం నర్సరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

భూ వివాదం కారణంగానే..

అయితే ఈ ఘటన గురించి తెలియగానే ఆస్పత్రికి చేరకుని ఈశ్వర్ రెడ్డిని యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్.. కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని చెప్పడానికి ఈఘటనే నిదర్శనం అన్నారు. కూటమి ప్రభుత్వం నేరస్తులకు రక్షిస్తారనే నమ్మకంతోనే దాడులకు పాల్పడుతున్నారు. సొంత పొలంకు సంబంధించి ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తుంది. ప్రత్యర్థులు ఈశ్వర్ ను బెదిరిస్తున్నప్పటికి పోలీసులు ఎలాంటి చర్యలు సుకోలేదు. పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు ఇలాంటి దాడికి ఒడిగట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండి: సుక్మాలో భారీ ఎన్ కౌంటర్.. సంబరాల్లో మునిగితేలిన పోలీసులు

రాష్ట్రంలో రక్షణ కరువైంది. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా హోంమంత్రి అట్టర్ ఫ్లాప్ అయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అరగంటకు ఒక అత్యాచారం జరుగుతుంది. 5 నెలల్లో ఇప్పటివరకు మహిళలపై 7,393 అత్యాచారాలు, దాడులు జరిగాయి. రాష్ట్రంలో ప్రజల రక్షణను గాలికి వదిలేసి అరాచకాలు, అత్యాచారాలు మీద ప్రభుత్వం రికార్డ్ కొట్టాలని చూస్తోందంటూ తీవ్ర విమర్శలు చేశారు. 

ఇది కూడా చదవండి: ఎమ్మెల్యేలు జారీపోకుండా కాంగ్రెస్ బిగ్ ప్లాన్ .. రిసార్ట్స్, ఫ్లైట్స్

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు