TGPSC Results: మరో నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే!

తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్‌ను టీజీపీఎస్‌సీ రిలీజ్ చేసింది. 581 పోస్టులకు పరీక్షలు నిర్వహించగా 574 మంది ఎంపికైనట్లు టీజీపీఎస్‌సీ ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/.

New Update
tgpsc

TG Hostel Welfare Officers Results Released

TG Hostel Welfare Officers: తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్‌ను టీజీపీఎస్‌సీ రిలీజ్ చేసింది. 581 పోస్టులకు పరీక్షలు నిర్వహించగా 574 మంది ఎంపికైనట్లు టీజీపీఎస్‌సీ ప్రకటించింది. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌(https://www.tspsc.gov.in/)ను సంప్రదించాలని సూచించింది. 

581 పోస్టులకు 574 మంది..

2022 డిసెంబర్‌‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళాశిశు సంక్షేమశాఖల పరిధిలోని వసతి గృహాల్లో 562, శిశు సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 2024 జూన్‌ 24 నుంచి 29 వరకు కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 82,873 మంది హాజరవగా ఇటీవలే కమిషన్‌ ఫలితాలను వెల్లడించింది. అయితే తాజాగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసి తుది ఫలితాలను విడుదల చేసింది. 

Also Read :   Betting Apps: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో కాజల్.. రంగంలోకి సజ్జనార్?

ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలో 298 పోస్టులున్నాయి. బీసీ సంక్షేమశాఖలో గ్రేడ్‌-2 మొత్తం 140 పోస్టుల్లో ప్రీమెట్రిక్‌ బాలుర వసతి గృహాల్లో 87 ఉద్యోగాలున్నాయి. పోస్టుమెట్రిక్‌ బాలుర వసతి గృహాల్లో 14, ప్రీమెట్రిక్‌ బాలికల వసతి గృహాల్లో 26, పోస్టుమెట్రిక్‌ బాలికల వసతి గృహాల్లో 13 ఖాళీలు ఈ నోటిఫికేషన్ తో భర్తీ కానున్నాయి. 

Also Read :  USA Road Accident :: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు