/rtv/media/media_files/2025/01/05/oTPJ5VS9ptsit7RCsuN3.jpg)
Telangana High Court Notification 2025 Released
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్ర హైకోర్టు భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తెలంగాణ హైకోర్టు పరిధిలో ఉన్న కోర్టులు, తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్‌లలోని వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 1673 పోస్టులను భర్తీ చేస్తోంది.
ఇది కూడా చదవండి: సినిమా ఇండస్ట్రీకి పవన్ కీలక సూచన.. సంచలన లేఖ విడుదల!
మొత్తం ఖాళీలు - 1673
తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ పరిధిలో 1461 ఖాళీలు ఉన్నాయి.
నాన్ - టెక్నికల్ - 1277
టెక్నికల్ - 184
పోస్టులు - ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III, అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, కంప్యూటర్ ఆపరేటర్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, సిస్టమ్ అనలిస్ట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
తెలంగాణ హైకోర్టు పరిధిలో - 212 ఖాళీలు ఉన్నాయి.
పోస్టులు - కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటేరియస్, కంప్యూటర్ అపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపిస్ట్, సిస్టమ్ అనలిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ ఉన్నాయి.
విద్యార్హత - పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అర్హులు. వీటితో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి.
వయోపరిమితి - 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం - ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
Also Read : బండి సంజయ్ నా బ్రదర్.. RTV ఇంటర్వ్యూలో పొన్నం సంచలన సీక్రెట్స్
సెలెక్షన్స్ - కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మెరిట్ లిస్ట్, స్కిల్ టెస్ట్, షార్ట్ హ్యాండ్ ఇంగ్లిష్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా సె
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - 08.01.2025.
దరఖాస్తుకు చివరి తేది - 31.01.2025.
ఇది కూడా చూడండి: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు
ఎగ్జామ్ డేట్‌లు - టెక్నికల్ పోస్టులకు ఏప్రిల్‌లో, నాన్ టెక్నికల్ పోస్టులకు జూన్ 2025లో ఉంటాయి.