/rtv/media/media_files/2025/08/07/tcs-2025-08-07-17-01-12.jpg)
TCS
ప్రస్తుతం ఐటీ రంగంలో లేఆఫ్స్ జరుగుతున్నాయి. దీంతో ఉద్యోగాలు దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏఐ వచ్చినప్పటి నుంచి ఉద్యోగాల సంఖ్య ఇంకా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఉద్యోగులు చేయాల్సిన పనిని ఏఐ ఈజీగా చేస్తుంది. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగస్తులను తొలగిస్తున్నాయి. అయితే దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవల ఎందరినో తొలగించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు కొత్తగా ఇంజనీరింగ్ విద్యార్థులను తీసుకుంటుంది. అది కూడా ఏఐ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఇవ్వనుంది. టీసీఎస్ కంపెనీకు ప్రపంచంలో ప్రధాన దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి.
ఇది కూడా చూడండి: High Paying Jobs: ఫ్రెషర్లకు బెస్ట్ ఆప్షన్స్.. ఈ 5 ఉద్యోగాలకు లక్షల్లో జీతం.. అనుభవం అవసరమే లేదు!
#TCS says it will create 5,000 new jobs in the UK over next three years as part of its continued investment in technology and innovation.
— NDTV Profit (@NDTVProfitIndia) October 10, 2025
Read: https://t.co/gGWQoh4xgQpic.twitter.com/DS8Brd2zOd
ఏఐ కొత్త స్టూడియో..
ఇప్పుడు లండన్‌లో కొత్త AI స్టూడియోను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌పీరియన్స్ జోన్ అండ్ డిజైన్ స్టూడియో అని పేరు పెట్టారు. ఈ క్రమంలోనే కొత్తగా నియమకాన్ని చేపట్టనుంది. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌పీరియన్స్ జోన్, డిజైన్ స్టూడియోలో భారతీయులకు కూడా ప్రాధాన్యత ఉండబోతోంది. మొత్తం 5 వేల నియామకాలను చేపట్టనుంది. దీనికి ఏఐ ఇంజనీరింగ్ చదువుతున్న భారతీయ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏఐ రంగంలో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. కొత్తగా సాంకేతిక పరిష్కారాలను అందించడంలో ఈ స్టూడియో కీలక పాత్ర కూడా పోషించనుంది. ఈ స్టూడియో వల్ల ఏఐ రంగంలో టీసీఎస్ ఫస్ట్ ఫ్లేస్‌లో ఉండేందుకు కుదురుతుంది. ఎవరైతే ఈ రంగంలో రాణించాలని అనుకుంటారో వారికి ఈ ఆఫర్ అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు.
ఇది కూడా చూడండి: Diwali Holidays : ఇదిరా కంపెనీ అంటే.. ఉద్యోగులకు 9 రోజులు దీపావళి సెలవులు