జాబ్స్ IT layoffs: ఐటీ ఉద్యోగులకు షాక్.. గంటకు 23 మంది ఔట్..!! ఐటీ ఉద్యోగులకు ప్రతిరోజూ ఓ గండంలా గడుస్తోంది. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో..ఎప్పుడు ఊడుతుందో తెలియక అయోమయంలో పడ్డారు. తెల్లవారితే ఉద్యోగం ఉంది...హమ్మయ్య అని అనుకునే పరిస్థితి నెలకొంది. దీనికి కారణాలు ఉన్నాయి. ప్రపంచం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొ్ంటున్న క్రమంలో బడా, చోటా కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ప్రాజెక్టులు తక్కువగా రావడం...కొత్త ప్రాజెక్టులపై ఆశలు లేకపోవడం వల్లే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిగంటకు ప్రపంచవ్యాప్తంగా 23మంది ఐటీ ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఐటీ కంపెనీలకు ఏ చిన్న విషయం కనిపించినా..ఉద్యోగులకే కాకకుండా దేశఆర్ధిక వ్యవస్థకు పెద్ద సవాల్ గా మారుతోంది. గంటకు 23మంది ఉద్యోగులు అంటే..మామూలు విషయం కాదు. 24గంటల్లో 552 మంది..అంటే నెలకు 30నరోజుల్లో 16వేల 560మంది ఐటీ ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోతున్నారు. By Bhoomi 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn