గ్రూప్ బి& సి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) గుడ్ న్యూస్ చెప్పింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన గ్రూప్ బి& సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 212 సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. Also Read: నేనూ మనిషినే తప్పులు చేస్తాను దేవుడిని కాదు–ప్రధాని మోదీ పోస్టుల బట్టి తత్సమాన విద్యార్హత, ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారు అర్హులు. వీటితో పాటు ఇంగ్లిష్, హిందీ కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జనవరి 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల్లోకి వెళితే.. మొత్తం ఖాళీలు - 212 గ్రూప్ బి పోస్టులు సూపరింటెండెంట్‌కి సంబంధించి 142 పోస్టులు ఉన్నాయి. అందులో ఎస్సీ- 21, ఎస్టీకి- 10, ఓబీసీ(ఎన్‌సీఎల్)కి- 38, ఈడబ్ల్యూఎస్‌కి- 14, యూఆర్‌కి- 59 పోస్టులు ఉన్నాయి. Also Read: మహా కుంభమేళాకు రానున్న స్టీవ్‌జాబ్స్ భార్య విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. లేదా తత్సమానంతో పాటు కంప్యూటర్/కంప్యూటర్ అప్లికేషన్స్, విండోస్, ms office, లార్జ్ డేటాబేస్ నిర్వహణ, ఇంటర్నెట్ పరిజ్ఞానం వంటివి కలిగి ఉండాలి. వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. గ్రూప్ సి పోస్టులు జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి 70 పోస్టులు ఉన్నాయి. అందులో ఎస్సీకి- 09, ఎస్టీకి- 09, ఓబీసీ(ఎన్‌సీఎల్)కి- 34, ఈడబ్ల్యూఎస్‌కి- 13, యూఆర్‌కి- 05 పోస్టులు ఉన్నాయి. Also Read: తగలబడుతున్నHollywood.. షూటింగ్ లు బంద్.. స్టార్ నటీనటుల ఇళ్ళు కూడా విద్యార్హతలు: ఇంటర్మీడియట్ కలిగి ఉండాలి. లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఇంగ్లిష్, హిందీ కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ వంటి పరిజ్ఞానం కలిగి ఉండాలి. వయోపరిమితి: 27 సంవత్సరాలు మించకూడదు. పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్ - విజయవాడ, ఢిల్లీ- ఢిల్లీ / నోయిడా, కర్నాటక- బెంగుళూరు, ఒడిషా- భువనేశ్వర్, రాజస్థాన్- అజ్మీర్, అస్సాం- గౌహతి, చండీగఢ్- చండీగఢ్ / పంచకుల, కేరళ- తిరువనంతపురం, బీహార్- పాట్నా, మహారాష్ట్ర- పూణె, ఉత్తర ప్రదేశ్- ప్రయాగ్రాజ్ (అలహాబాద్), తమిళనాడు- చెన్నై, మధ్యప్రదేశ్- భోపాల్, ఉత్తరాఖండ్- డెహ్రాడూన్. Also Read: ఒకవైపు మంచు తుఫాను..మరోవైపు కార్చిచ్చు..అల్లాడిపోతున్న అమెరికా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.01.2025. దరఖాస్తుకు చివరి తేది: 31.01.2025. ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.