/rtv/media/media_files/2025/06/30/cbse-class-10th-and-12th-supplementary-exam-2025-schedule-released-2025-06-30-16-17-28.jpg)
CBSE class 10th and 12th supplementary exam 2025 schedule released
CBSE 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు పరీక్షలకు సంబంధించిన వివరాలను cbse.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఈ పరీక్షల షెడ్యూల్ ప్రకారం.. వచ్చే నెల అంటే జూలై 15వ తేదీ నుండి 22వ తేదీ వరకు CBSE 10వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 2025 నిర్వహించనున్నారు.
CBSE 10th క్లాస్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్
Also Read: జూలై 1వ తేదీ నుంచి మారనున్న రూల్స్ ఇవే!
CBSE Supplementary Exam 2025 Schedule
ఇందులో కొన్ని పేపర్లకు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించనున్నారు. మరికొన్ని పేపర్లకు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
Also Read: పేద ఖైదీలకు కేంద్రం గుడ్‌న్యూస్.. బెయిల్‌కు ఆర్థిక సాయం
దీంతోపాటు CBSE 12th క్లాస్ సప్లిమెంటరీ పరీక్షల 2025 షెడ్యూల్ విషయానికొస్తే.. జూలై 15న పరీక్షలు జరుగుతాయి. ఇందులో కూడా కొన్ని పరీక్షలకు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. మరికొన్ని పరీక్షలకు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
CBSE 12th క్లాస్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్
Also Read: దుర్మార్గ తండ్రి.. నాలుగేళ్ల కూతురు చాక్లెట్ అడిగిందని.. దారుణంగా!
cbse-exams | cbse-board-exams | cbse-board-10th | cbse-board