/rtv/media/media_files/2025/01/18/QMsBR1ZhIjGsvXPsKUBK.jpg)
BOB Recruitment 2025
BOB Recruitment 2025: మీ కెరీర్‌ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి బ్యాంక్ ఆఫ్ బరోడాలో అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ప్రముఖ బ్యాంక్ ఆఫ్ బరోడాలో వివిధ విభాగాలలో నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. మేనేజర్ వంటి రంగాలలో వేర్వేరు హోదాలకు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ, ఎంపిక ప్రక్రియ గురించి సమాచారం ఆయా అధికారిక వెబ్‌సైట్లలో లభిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వివరాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
Also Read: కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్ విసిరిన BRS ఎమ్మెల్యే
బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) వివిధ విభాగాల్లో మేనేజర్లు, ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల కోసం మొత్తం 417 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 6 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 26, 2025. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.in ద్వారా మాత్రమే సమర్పించాలి. ఈ నియామకాలలో మేనేజర్ - సేల్స్, ఆఫీసర్ - అగ్రికల్చర్ సేల్స్, మేనేజర్ - అగ్రికల్చర్ సేల్స్ వంటి కీలక పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులలో మొత్తం 227 మేనేజర్ - సేల్స్, 142 ఆఫీసర్ - అగ్రికల్చర్ సేల్స్, 48 మేనేజర్ - అగ్రికల్చర్ సేల్స్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫీజు చెల్లింపు చివరి తేదీకి ముందే పూర్తి చేయాలని బ్యాంక్ సూచించింది.
దరఖాస్తు ఫీజు వివరాలు:
జనరల్, EWS, OBC అభ్యర్థులకు రూ. 850 మరియు వర్తించే పన్నులు
SC, ST, PwD, ESM/DESM కేటగిరీల అభ్యర్థులకు, మహిళా అభ్యర్థులకు రూ. 175 వర్తించే పన్నులు.
దరఖాస్తు విధానం:
అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.in సందర్శించాలి
కెరీర్స్ సెక్షన్‌కి వెళ్ళి, సంబంధిత నోటిఫికేషన్‌ని ఎంచుకోవాలి
ఆన్‌లైన్ దరఖాస్తుపై క్లిక్ చేసి అవసరమైన వివరాలను నింపాలి
అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించాలి
దరఖాస్తును సమర్పించి.. రసీదు కాపీని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరచుకోవాలి
ఇది కూడా చదవండి: ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. క్యాప్‌జెమినీ కంపెనీలో 45,000 జాబ్స్
ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ వంటి దశలు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఉద్యోగ వేతనం అనుభవం, హోదాను బట్టి నెలకు రూ. 48,480 నుంచి రూ. 93,960 వరకు ఉంటుంది.
ఇది కూడా చదవండి: నెలకు రూ.60 వేల జీతంతో SBIలో క్లర్క్ ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఆ రోజే!