AP : ఏపీ ప్రభుత్వం నిరోద్యోగ యువతకు శుభవార్తను చెప్పింది. యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఈ నెల 14న మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. తన నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎనికేపాడు టీడీపీ కార్యాలయ ఆవరణలో ఈ జాబ్ మేళ జరగనుంది. Also Read: ఇంకోసారి అలా రాస్తే ఊరుకునేది లేదు.. సాయి పల్లవి స్ట్రాంగ్ వార్నింగ్ Also Read : భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. హోంమంత్రి కీలక సూచనలు 50కి పైగా కంపెనీలు.. మెగా జాబ్ మేళా ఈ మేళాలో హెచ్సీ ఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, మెడ్ ప్లస్, అరబిందో ఫార్మా, పేటిఎం, విజేత సూపర్ మార్కెట్, HDFC, కొటక్, ఇండిగో, వరుణ్, రిలయన్స్ క్యాపిటల్, ఎయిర్ టెల్, వంటి 50 ప్రముఖ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు భాగం కానున్నట్లు ఎమ్మెల్యే వెంకట్రావు తెలిపారు. ఏడో తరగతి నుంచి డిగ్రీ, బీటెక్, ఎంబీఏ అర్హత కలిగిన ఎవరైనా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. Also Read: మంచు ఫ్యామిలీ వివాదాలకు సౌందర్యతో లింక్.. అసలు విషయం తెలిస్తే షాక్! Also Read : Sadhguru: వాళ్లని రాజకీయాల్లోకి లాక్కండి.. సద్గురు సంచలన పోస్ట్