Telangana : అసెంబ్లీ సమావేశాల్లో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాం : సీఎం రేవంత్

తెలంగాణలో జులై 23 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏటా మార్చిలోగా అన్ని శాఖల నుంచి ఖాళీలు సేకరించి, జూన్‌ 2 లోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని..డిసెంబర్ 9లోగా నియామకాలు పూర్తి చేస్తామన్నారు.

CM Revanth Reddy: భూ సేకరణ బాధితులకు మెరుగైన పరిహారం: రేవంత్ రెడ్డి
New Update

CM Revanth Reddy : తెలంగాణ (Telangana) లో జులై 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు (Assembly Meeting) ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాల్లోనే జాబ్‌ క్యాలెండర్‌ (Job Calendar) ను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతీ ఏడాది మార్చిలోగా అన్ని శాఖల నుంచి ఖాళీలు సేకరిస్తామని.. జూన్‌ 2 లోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని పేర్కొన్నారు. అలాగే డిసెంబర్ 9లోగా నియామకాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం ప్రజాభవన్‌ (Praja Bhavan) లోని 'రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం' అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

Also Read: కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం-మంత్రి ఉత్తమ్

ఈ కార్యక్రమంలో 2023 లో తెలంగాణ నుంచి సివిల్స్‌కు ఎంపికైన 35 మందిని, ఐఎఫ్‌ఎస్‌ ఎంపికైన ఆరుగురిని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అలాగే ఈ ఏడాది (2024) లో సివిల్స్ ప్రిలిమ్స్‌కు ఉత్తీర్ణులైన వారికి సింగరేణి  (Singareni) సంస్థ తరపున రూ.లక్ష చొప్పున సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు,కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read: పైరవీకారులకే సచివాలయ ఎంట్రీ- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

#telugu-news #job-calender #cm-revanth #telangana-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి