Telangana: పైరవీకారులకే సచివాలయ ఎంట్రీ- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ నిలువునా మోసం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం పోయి, సోనియా కుటుంబం వచ్చిందని..దీన్నే మార్పు అంటారా అంటూ ఆయన తెలంగాణ ప్రభుత్వం మీద మండిపడ్డారు. 8 నెలల్లోనే రేవంత్ సర్కార్ వంచనకు గురిచేస్తోందని ఆయన విమర్శించారు.

New Update
Telangana: పైరవీకారులకే సచివాలయ ఎంట్రీ- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Central Minister Kishan Reddy: మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ నినాదం వదిలేశారని, ఉద్యమ సెంటిమెంట్ తో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణకు తీరని శోకాన్ని మిగిల్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద వనివారం బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నాకు ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది యువత అని, ఆత్మ బలిదానాలు, త్యాగాలు చేసింది వారేనని, తెలంగాణ సాధన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. కానీ తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ వాడుకుని వదిలేశారని ఆయన మండిపడ్డారు.

అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రేవంత్ సర్కార్ తెలంగాణ యువతను నయ వంచనకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. డిక్లరేషన్ల పేరుతో అనేక హామీలు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని కాంగ్రెస్ నిలువునా మోసం, దోపిడీ చేస్తోందని విమర్శలు చేశారు. రైతు రుణ మాఫీ పేరుతో కాంగ్రెస్ రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శలు చేశారు. అరకొర రుణ మాఫీ చేసి రైతులకు శఠగోపం పెట్టారన్నారు. రైతులను మోసం చేయడమే కాక, క్షీరాభిషేకం చేసుకుంటారా అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి అమలుకు ఎందుకు నోచుకోవడం లేదని ప్రశ్నించారు. సచివాలయంలోకి ఫైరవికారులకు మాత్రమే అనుమతి ఉందని ఆరోపించారు. అటు సిద్ధరామయ్య, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు సాగించేది ప్రజాపాలన కాదని, ముంచే పాలనను కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం పోయి, సోనియా కుటుంబం వచ్చిందని, కేసీఆర్ దోపిడీ పోయి, రాహుల్, రేవంత్ ల దోపిడీ వచ్చిందని కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు.

దాంతో పాటూ తెలంగాణలో మార్పు అంటే ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. గులాబీ జెండా పోయి, కాంగ్రెస్ జెండా రావడమే మార్పా? ఫిరాయింపులు చేసుకోవడమా మార్పా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ రేవంత్ రెడ్డి ఫిరాయింపులకు పాల్పడటం ప్రజాపాలన ఎలా అవుతుందని నిలదీశారు. ఇచ్చిన హామీలను విస్మరిస్తే ఊరుకునేది లేదని, భవిష్యత్ పోరాటాలకు సిద్ధమవుతామని కిషన్ రెడ్డి హెచ్చరించారు.

Also Read:Madhya Pradesh: కారులో బాలికపై అత్యాచారం..వీడియో తీసి బ్లాక్ మెయిల్



Advertisment
తాజా కథనాలు