Jay Shah:ఐసీసీ ఛైర్మ్‌గా జై షా ఎన్నికయ్యారు. ఎటువంటి అపోజ్ లేకుండానే ఆయన ఈ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటివరకు బీసీసీఐ ఛైర్మన్‌గా ఉన్న జైషా ఇక మీదట ఐసీసీ వ్యవహారాలు చూసుకోనున్నారు. ఈయన కేంద్ర హోంమత్రి అమిత్ షా కుమారుడు. జైషా డిశంబర్ 1 నుంచి ఐసీసీ ఛైర్మన్ బాధ్యతలను చూసుకోనున్నారు. ఇక ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న వారిలో ఇతనే పిన్న వయస్కుడు. జై వయసు 35 ఏళ్ళు. 2019నుంచి ఈయన బీసీసీఐ ఛర్మన్‌గా ఉన్నారు.
ఐసీసీ ఛైర్మన్ పదవికి నామినీస్ ను ఆహ్వానించారు. అయితే ఇందులో జైషా తప్ప వేరెవ్వరూ నామినేషన్ వేయలేదు. మరోవైపు ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న గ్రెగ్ బార్కెలే మూడోసారి కంటిన్యూ అవడానికి ఇష్టపడలేదు. దాంతో జై షా నే ఏకగ్రీవంగా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. భారతదేశం నుంచి ఐసీసీ ఛైర్మన్‌గా పని చేసిన వారిలో జై ఐదవ వారు అవుతారు. అంతకు ముందు జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్. శ్రీనివాన్, శశాంక్ మనోహర్‌లు దీనిని చేపట్టారు.