Work: వావ్‌ సూపర్‌.. ఆ దేశంలో వారానికి నాలుగు రోజులే వర్క్‌..

జపాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని సంస్థల్లో ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేయాలని పేర్కొంది. ఈ విధానం అన్ని సంస్థల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ విధానం వల్ల ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది.

Work: వావ్‌ సూపర్‌.. ఆ దేశంలో వారానికి నాలుగు రోజులే వర్క్‌..
New Update

సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వారానికి ఆరు రోజులు పనిచేయాల్సి ఉంటుంది. ఐటీ కంపెనీలు, మరికొన్ని ఇతర సంస్థలు వారానికి రెండు రోజులు సెలవులు ఇస్తాయి. వారానికి నాలుగు రోజులే పనిదినాలు ఇచ్చి, మూడు రోజులు సెలవులు ఇస్తే ఎలా ఉంటుంది. ఊహిస్తేనే బాగుంది కదా. అయితే జపాన్‌ ప్రభుత్వం ఇప్పుడు ఇదే నిర్ణయం తీసుకుంది. అన్ని సంస్థల్లో ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేయాలని పేర్కొంది. ఈ విధానం అన్ని సంస్థల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

వాస్తవానికి ఈ విధానాన్ని 2021లోనే అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశాయి. కానీ చాలా సంస్థలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. ఇలా చేస్తే అభివృద్ధి విషయంలో జపాన్ కొంతకాలం వెనుకబడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. కేవలం 8 శాతం సంస్థలు మాత్రమే ఈ విధానాన్ని పాటించాయి. ఈ నేపథ్యంలో మిగిలిన అన్ని సంస్థలు కూడా తమ ఉద్యోగులతో వారానికి నాలుగుసార్లు మాత్రమే పని చేయించుకోవాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: లావోస్‌లో సైబర్ స్కామ్ సెంటర్లు.. 47 మంది భారతీయులకు విముక్తి

ఈ విధానం వల్ల ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని పేర్కొంది. సూక్ష్మ, మధ్య తరహ పరిశ్రమల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వొచ్చని తెలిపింది. దీంతో నిరుద్యోగ రేటు కొంతవరకైనా తగ్గే అవకాశం ఉంటుందని తెలిపింది. అలాగే తక్కువ పనిదినాలు ఉండటం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపొచ్చని.. అలాగే పిల్లల పెంపకంపై దృష్టి పెట్టే ఛాన్స్ ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం జపాన్‌లో ఉద్యోగులు ఓవర్‌ టైం డ్యూటీలు చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని ఓ సర్వే వెల్లడించింది.

ఇదిలాఉండగా.. వారానికి నాలుగు రోజుల పని దినాల విధానాన్ని ప్రస్తుతం టోక్యోలో అకికో యోకోహామా అనే సంస్థ పాటిస్తోంది. ఈ కంపెనీ ప్రకారం తమ ఉద్యోగులకు శని, ఆదివారాలతో పాటు బుధవారం కూడా హాలిడే ఇస్తోంది. ఇలా చేయడం వల్ల ఉద్యోగులు ఒత్తిడికి గురికాకుండా చురుగ్గా పనిచేస్తున్నారని ఆ సంస్థ తెలిపింది. అలాగే తక్కువ పని దినాలు ఉండటం వల్ల ఉద్యోగులు వేగంగా పనులు పూర్తిచేస్తున్నారని స్పష్టం చేసింది.

Also Read: కరోనా వల్ల బ్రెయిన్‌ సమస్యలు.. సర్వేలో బయటపడ్డ సంచలన నిజాలు

#japan #jobs #work-in-japan #japan-people
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe