AP Elections 2024: టీడీపీ నేతలు తీరుపై జనసేన నేతలు మండిపడ్డారు. అవనిగడ్డ నియోజకవర్గ అభ్యర్థిగా జనసేన పార్టీకి ఇస్తే.. 21 సీట్‌లో మొదటి సీటు ఓడిపోయేది అవనిగడ్డ అని టీడీపీ నేతలు అన్నారు. నేడు ఏ విధంగా జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ కండువా కప్పుకుంటున్నారని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. నేడు అవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ అత్యవసర సమావేశాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు బచ్చు వెంకట్నాథ్ అధ్యక్షతన ఆ పార్టీ నేతలు నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అందరు కూడా బుద్ధ ప్రసాద్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
జనసేన పార్టీ నుంచి బయటికి వస్తాయి:
అవనిగడ్డలో గాజు గ్లాసుకి ఇస్తే ఓడిపోతుందని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన టీడీపీ నేతలు నేడే ఏ విధంగా బుద్ధ ప్రసాద్ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తారని ప్రశ్నించారు. బుద్ధ ప్రసాద్ టిక్కెట్ ఇస్తే మూకముడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కొంతమంది బావ దేవరపల్లి జనసైనికులు మాట్లాడుతూ.. బావదేవరపల్లిలో జరిగిన అంకాలమ్మతల్లి జాతరలో జనసేన జెండాలు పట్టుకున్న వారిపై బుద్ధప్రసాద్ తమ్ముడు కేసులు పెట్టించాడని తీవ్రంగా మండిపడ్డారు. బుద్ధ ప్రసార్‌కు జనసేన పార్టీ టికెట్ ఇస్తే ఆ గ్రామం నుంచి 100 కుటుంబాలు జనసేన పార్టీ నుంచి బయటికి వస్తాయని హెచ్చరించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులు అంతా కూడా బుద్ధ ప్రసాద్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల పోటీ చేయాలంటే డబ్బులు కావాలి అన్న వ్యక్తి నేడు జనసేన టికెట్ ఇస్తే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెబితే మేం కూడా అదే విధంగా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. టీడీపీ నేతలు సోషల్ మీడియాలో తమ ఇష్టానుసారం ప్రచారం చేసి.. నేడు ఏ విధంగా జనసేన పార్టీలో చేరుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సమావేశంలో ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, రాష్ట్ర సర్పంచ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిలకలపూడి పాపారావు, మత్తి వెంకటేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు బచ్చు వెంకట్‌నాథ్, జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి లంకె యుగంధర్‌రావు, ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కొండవీటి సునీత, బొప్పన భానుతోపాటు జనసేన పార్టీ ముఖ్య నేతలు, వీర మహిళలు జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: వ్యాక్స్ చేయించుకున్నాక అమ్మాయిలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి