Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా (Deputy CM) బాధ్యతలు చేపట్టేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారని ఓ జాతీయ మీడియా ఆదివారం వెల్లడించింది. ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవానికి పవన్ కల్యాణ్.. తన సతిమణితో కలిసి హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భానే ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. అయితే రిపోర్టర్ ప్రశ్నలు, ఆయన వ్యాఖ్యానం అస్పష్టంగా ఉండటంతో పవన్ ఏం మాట్లాడారు అనేది సరిగా వినపడలేదు. అనంతరం ఆ రిపోర్టర్.. పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.
Also Read: మోదీ మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కులు వీళ్లే..
దీంతో పవన్ చెప్పిన విషయంపై ఆ ఛానల్‌లో కొంతసేపు స్క్రోలింగ్ ప్రసారం చేశారు. జనసేన అధినేత ఏపీలో డిప్యూటీ సీఎం పదవి ఆశిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. ఈనెల 12న బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరికొంత మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. అయితే పవన్ కల్యాణ్‌కు మరి ఎలాంటి పదవి దక్కుతుందో అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఈసారి జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో అలాగే రెండు పార్లమెంటు స్థానాల్లో 100 శాతం విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Also Read: వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల బెట్టింగ్ పెట్టాడు.. చివరికీ