Pawan Kalyan : పవర్ కట్ చేసి ఏ ఉద్దేశంతో చీకటిలో యాత్ర చేశారు : పవన్ కల్యాణ్ సీఎం జగన్‌పై జరిగిన రాళ్ల దాడి ఘటనపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయించడం ఏంటని ప్రశ్నించారు. ఏ ఉద్దేశంతో పవర్ కట్ చేసి.. చీకట్లో యాత్ర చేశారంటూ నిలదీశారు. By B Aravind 16 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Power Cut : ఇటీవల విజయవాడ(Vijayawada) లో బస్సు యాత్ర(Bus Yatra) చేస్తుండగా సీఎం జగన్(CM Jagan) పై జరిగిన రాళ్ల దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి సంబంధించి.. జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఎక్స్(X) వేదికగా స్పందించారు. దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయించడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనపై డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. Also Read: రాజంపేట డీమ్డ్ వర్సిటీ లేడీస్ హాస్టల్‌లో దారుణ సంఘటన ' సీఎం జగన్ వీవీఐపీ కేటగిరిలో ఉన్నారని.. ఆయన ఎక్కడకు వెళ్లినా కూడా పరదాలు కట్టి, చెట్లు నరికేసేవారు. అవన్నీ పట్టపగలే చేశారు కదా. మరి ఏ ఉద్దేశంతో పవర్ కట్ చేసి.. చీకట్లో యాత్ర చేశారు. బాధ్యులైన అధికారులను బదిలీ చేయాలి. సరైన అధికారులకు విచారణ అప్పగించేలా చర్యలు తీసుకోవాలి. అప్పడే భద్రత చర్యల్లో లోపాలు ఏంటి.. ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏంటి అనే విషయాలు వెలుగులోకి వస్తాయి. రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ పాల్గొన్నప్పుడే భద్రతాపరంగా లోపాలు బయటపడ్డాయి. ఇలాంటి అధికారులు ఉన్నట్లైతే రాష్ట్రంలో మరోసారి ప్రధాని మోదీ(PM Modi) పర్యటించినప్పుడు కూడా ఇంతే నిర్లక్ష్యం వహిస్తారు. ఈ అధికారులతో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహించగలరు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టిపెట్టాలి' అని పవన్ కోరారు. Stone Pelting on CM Jagan Reddy means failure of the State Intelligence, DGP, Intelligence Chief, Vijayawada Police Commissioner and Chief Minister's Security Officers. Instead of investigating their failure now they are given the job of investigating the stone pelting incident?… — Pawan Kalyan (@PawanKalyan) April 15, 2024 Also Read: తెలంగాణలో భానుడి భగభగలు..ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త #pawan-kalyan #telugu-news #cm-jagan #janasena #andhra-pradeh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి