ఏపీలో పరిపాలన పగ్గాలు చేపట్టిన ఎన్టీయే ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడాలని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీకి చెందిన ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడకూడదని ఆదేశించారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యంలో.. ఎవరూ పార్టీ నియమాలు ఉల్లంఘించినా, అధికారుల పనితీరును బలహీనపరిచేలా నిరాధర ఆరోపణలు చేసినా వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..
Also read: అధైర్య పడొద్దు.. అండగా ఉంటా: జగన్
అలాగో ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి అధికారిక సమావేశాల్లో.. పార్టీ నాయకులు గానీ, కార్యకర్తలు గానీ పాల్గొనడం కూడా రూల్స్ ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ముందుగా షోకాజ్ నోటీసు జారీ అవుతుందని.. దీనికి సరైన సమాధానం రాకపోతే వాళ్లపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. పార్టీ ప్రతిష్ఠను ముందుకు తీసుకెళ్లేలా ప్రతిఒక్కరూ పనిచేయాలని కోరారు.
Also Read: టార్గెట్ తెలంగాణ.. తన వ్యూహమేంటో చెప్పేసిన చంద్రబాబు!