Singareni Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Elections) విజయం సాధించిన కాంగ్రెస్ (Congress).. ఈ నెల 27న జరగబోయే సింగరేణి ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అన్ని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఐఎన్టీయూసీని గెలిపించుకునేలా పార్టీ తరఫున ప్లానింగ్ జరుగుతోంది. సుమారు 15 అసెంబ్లీ, ఐదు పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలో సింగరేణి గనులు, కార్మికులు ఉన్నందున అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే గెలవాలని హస్తం పార్టీ భావిస్తోంది. ఇందుకోసం మంథని ఎమ్మెల్యే, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu Duddilla) ఐఎన్టీయూసీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. సింగరేణి విస్తరించిన ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలకూ దిశానిర్దేశం చేశారు.
ALSO READ: BREAKING: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
గత రెండుసార్లు వరుసగా బీఆర్ఎస్ కు(BRS Party) అనుబంధంగా ఉన్న టీజీబీకేఎస్ విజయం సాధించడంతో ఈసారి కాంగ్రెస్ కు అనుబంధంగా ఉన్న సంఘాన్ని గెలిపించాలని ఆయన స్పష్టం చేసినట్లై తెలుస్తోంది. ప్రతీ నాలుగేండ్లకోసారి ఎన్నికలు జరిగే ఆనవాయితీ ప్రకారం 2021లో జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో చివరకు హైకోర్టు జోక్యం చేసుకోవడంతో ఈ నెల 27న ఎన్నికల ముహూర్తం ఖరారైంది.
మొత్తం 11 డివిజన్లలోని ఐఎన్టీయూసీ నేతలతో మీటింగ్ నిర్వహించారు శ్రీధర్ బాబు. సుమారు 40 వేల మంది కార్మికులు ఓటు హక్కు వినియో గించుకోనున్నారు1990వ దశకం నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు ఎన్నికలు జరగ్గా మూడుసార్లు ఏఐటీయూసీ (సీపీఐకి అనుబంధ కార్మిక సంఘం), రెండుసార్లు బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్న సంఘం, ఒకసారి కాంగ్రెస్ కు అనుబంధంగా ఉన్న ఐఎన్టీయూసీ గెలిచింది. ఈసారి కూడా గెలవాలనే ధీమాతో కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది.
ALSO READ: పెన్షన్ రూ.3,000కు పెంపు…రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
పోలీసుశాఖలో నియామకాలపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి
పోలీసుశాఖలో నియామకాలపై సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). మాజీ డీఎస్పీ నళినికి (Former DSP Nalini) అదే ఉద్యోగం ఎందుకు ఇవ్వకూడదు అని అధికారులను ప్రశ్నించారు. నళిని తెలంగాణ కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారని అన్నారు. నళినికి అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటి అని అడిగారు. నళిని ఉద్యోగంపై ఆసక్తి ఉంటే మళ్లీ విధుల్లోకి తీసుకోవాలమీ ఆదేశలు ఇచ్చారు. పోలీసుశాఖలో నిబంధనలు అడ్డు వస్తే.. ఇతర ఉద్యోగం ఇవ్వాలని పేర్కొన్నారు. ఉద్యోగం వదిలి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారు మళ్లీ ఉద్యోగాల్లో చేరారని అన్నారు. తెలంగాణ కోసం ఉద్యోగాన్ని త్యజించిన నళినికి ఎందుకు ఇవ్వకూడదని సీఎం రేవంత్ ఉన్నతాధికారులను ప్రశ్నించారు.