Terrorist Attack :అంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేశారు..ఉగ్రదాడిలో బయటకొస్తున్న నిజాలు

నిన్న జమ్మూ-కాశ్మీర్ లోని ఫూంచ్ లో ఉగ్రవాదుల దాడి ప్రీప్లాన్డ్ అని చెబుతున్నారు భారత సైన్యాధికారులు. ముందుగా దాడి ప్రాంతాన్ని రెక్కీ నిర్వహించి.. ఆ తర్వాత మూల మలుపు వద్ద కొండల్లో దాక్కొని దాడులు చేసినట్లు భద్రతా అధికారులు గుర్తించారు.

New Update
Terrorist Attack :అంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేశారు..ఉగ్రదాడిలో బయటకొస్తున్న నిజాలు

Jammu and Kashmir : గత నెల రోజుల వ్యవధిలోనే రెండు సార్లు భారత జవాన్ల మీద ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. దీంతో నిన్న జరిగిన అటాక్ సంచలనంగా మారింది. ఈ ఘటనపై ఇప్పటికే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో నమ్మలేని విషయాలు బయటపడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్‌(Jammu & Kashmir) లోని పూంఛ్‌ జిల్లా(Poonch District)లో సైనికులను తరలిస్తున్న రెండు వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులు చేశారు. సైనికులు వెళుతున్న దారి పక్కనే ఒక కొండ ఉంది. అక్కడఏ మూల మూల నక్కి మరీ దాడులు చేశారు ఉగ్రవాదులు. భారత సైనికులు తేరుకుని ఎదురు దాడి జరిపేలోపు వారు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఉగ్రవాదులు చేసిన దాడిలో ఐదుగురు సైనికులు అమరులయ్యారు.

Also read:వచ్చే ఏడాది నుంచి టోల్ ప్లాజాలుండవు..కేంద్రం కొత్త ప్లాన్

జమ్మూ-కాశ్మీర్ లోని ధేరా కి గాలి, బుఫ్లియాజ్ మార్గంలో ప్రమాదకరమైన మూల మలుపు ఒకటి ఉంది. దీంతో అక్కడే సైనిక వాహనాలపై దాడి చేయాలని ఉగ్రవాదులు నిర్ణయించుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆ మూల మలుపులో ఏ వాహనాలు అయినా స్లోగా వెళ్ళాల్సిందే. అలాంటి టైమ్ లో కాల్పులు జరిపితే ఎక్కువ మంది ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఉగ్రవాదులు భావించారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ దాడి కోసం ఉగ్రవాదులు ముందుగానే రెక్కీ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు కొండల్లో నక్కి ఉండి కాల్పులకు పాల్పడినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతంలో భద్రతా సిబ్బంది కార్డన్‌ సెర్చ్‌ చేపట్టి అనువణువూ గాలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్‌లతో పాటు డ్రోన్లను ఉపయోగించి గాలింపు ఆపరేషన్ చేపట్టారు. అవసరమైతే అదనపు భద్రతా సిబ్బందిని మోహరించి ముష్కరులను పట్టుకుంటామని ఆర్మీ అధికారులు ప్రకటించారు. మరోవైపు భారత సైనికుల మీద దాడికి తామే బాధ్యులమని పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన పీపుల్స్‌ యాంటీ ఫాసిస్ట్‌ ఫ్రంట్‌ ఇప్పటికే ప్రకటించుకుంది.

Advertisment
తాజా కథనాలు