ఈ సారీ జీతం ఎంత పెరుగుతుందో!.. అసలు హైక్ ఇస్తారా!.. ఐటీ ఉద్యోగుల్లో ఇప్పుడిదే చర్చ

సాధారణంగా, ఐటీ కంపెనీలు ఫైనాన్షియల్‌ ఇయర్‌ సెకండ్‌ క్వార్టర్‌ (జూలై) నుంచి జీతాలను పెంచి, వాటిని ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తాయి. అయితే, ఈసారి దాదాపు అన్ని ఐటీ కంపెనీలు ఆ సమయంలో జీతాల పెంపును వాయిదా వేయగా; ఆ పని ఇప్పుడు చేస్తున్నాయట.

ఈ సారీ జీతం ఎంత పెరుగుతుందో!.. అసలు హైక్ ఇస్తారా!.. ఐటీ ఉద్యోగుల్లో ఇప్పుడిదే చర్చ
New Update

Salary Hike: హైక్‌.. కార్పొరేట్‌ ప్రపంచంలో ప్రతీ ఉద్యోగీ ఏటేటా ఎదురుచూసేది దీనికోసమే. జీతం ఎంత పెరుగుతుందా అని కంపెనీలో కొలువు చేస్తున్న వారంతా ఎంత ఆశగా ఎదురుచూస్తారో తెలిసిందే. కొన్ని కంపెనీలు ఉద్యోగుల అంచనాలను మించి వారిని సంతృప్తి పరిస్తే, మరికొన్ని అసలు ఆ ఊసే లేకుండా ఉసూరుమనిపిస్తాయి. సాధారణంగా, ఐటీ కంపెనీలు ఫైనాన్షియల్‌ ఇయర్‌ సెకండ్‌ క్వార్టర్‌ (జూలై) నుంచి జీతాలను పెంచి, వాటిని ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తాయి. అయితే, ఈసారి దాదాపు అన్ని ఐటీ కంపెనీలు ఆ సమయంలో జీతాల పెంపును వాయిదా వేయగా; ఆ పని ఇప్పుడు చేస్తున్నాయట. మరి ఈ కొత్త సంవత్సరం కొన్ని ప్రముఖ కార్పొరేట్‌ కంపెనీల్లో జీతాల పెంపు ఎలా ఉందో తెలుసుకుందామా!

ఇన్ఫోసిస్‌ నిర్ణయమిదేనా! 
ఐదారు నెలలుగా జీతాల పెంపు అంశాన్ని వాయిదా వేస్తూ వస్తున్న టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కొత్త ఏడాది ఇంకా రాకముందే శుభవార్త చెప్పింది. తాజాగా జీతాల పెంపుపై ఆ కంపెనీ స్పష్టత ఇచ్చింది. త్వరలోనే జీతాలను పెంచుతామని పేర్కొన్నది. పెరిగిన జీతాలు నవంబర్‌ 1 నుంచి అమలవుతాయని చెప్పింది. అయితే ఈ పెంపు ఉద్యోగులందరికి వర్తించదట. 2021 అక్టోబర్ తర్వాత జూనియర్ స్థాయి, మేనేజర్ స్థాయి ఉద్యోగులకు జీతాల పెంపు జాబితాలో చోటు దక్కలేదు. జీతం పెరుగుల 7 శాతం నుంచి 10 మధ్యలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: రైతు బిడ్డ రాజయ్యాడు.. బిగ్‌ బాస్‌ చరిత్రలో నెవర్‌ బిఫోర్‌..!

విప్రో
ఇప్పటికే భారీగా జీతాలు తీసుకుంటున్న వారికి కాకుండా; పనితీరు బాగుండి, తక్కువ జీతానికే పనిచేస్తున్నవారికి జీతాలు పెంపు ఉంటుందని నివేదికలు హైలెట్‌ చేశాయి.

హెచ్‌సీఎల్‌
జీతాల పెంపు విషయాన్ని రెండు సార్లు వాయిదా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సీనియర్ ఉద్యోగులకు జీతాల పెంపును నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.

యాక్సెంచర్‌
అమెరికాకు చెందిన ఐటీ కంపెనీ యాక్సెంచర్ కూడా అదే బాటలో ఉంది. ఈ ఏడాది భారత్, శ్రీలంకలో ఉన్న తమ ఉద్యోగులకు జీతాల పెంపు ఉండదని, కీలక విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకే జీతాల పెంపు ఉంటుందని తెలుస్తోంది. ఆర్ధిక మాద్యం భయాల ఫలితంగా ఆశించిన స్థాయిలో రిజల్ట్‌ లేకపోవడంతో ప్రమోషన్లు, రివార్డుల విషయంలో కూడా సంస్థ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుందట.

#wipro #infosys #hcl #accenture
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe