Bigg Boss 7 Winner Pallavi Prashanth: రైతు బిడ్డ రాజయ్యాడు.. బిగ్‌ బాస్‌ చరిత్రలో నెవర్‌ బిఫోర్‌..!

మొదటి సారి బిగ్ బాస్ చరిత్రలో కామాన్ మ్యాన్‌గా టైటిల్ గెలిచి రికార్డు సృష్టించాడు పల్లవి ప్రశాంత్. తెలుగు బిగ్‌బాస్‌-7 టైటిల్‌ విన్నర్‌గా నిలిచాడు. తెలంగాణలోని సిద్దిపేటలో జన్మించిన ప్రశాంత్ రైతు బిడ్డగా అడుగుపెట్టి టైటిల్‌ గెలవడంతో ప్రశంసల వర్షం కురుస్తోంది.

New Update
Bigg Boss 7 Winner Pallavi Prashanth: రైతు బిడ్డ రాజయ్యాడు.. బిగ్‌ బాస్‌ చరిత్రలో నెవర్‌ బిఫోర్‌..!

Pallavi Prashanth: ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) ఎన్నో ట్విస్టులతో ఆసక్తికరంగా సాగింది. 15 వారాల పాటు సాగిన ఈ రియాలిటీ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ రోజుతో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరనే ప్రశ్నకు తెర పడింది. అమర్, పల్లవి ప్రశాంత్, శివాజీ మధ్య జరిగిన టైటిల్ పోరులో ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్స్ పొందిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచాడు.

రైతు బిడ్డ రాజయ్యాడు అంటూ ప్రేక్షకులు చేసిన వ్యాఖ్యలను నిజం చేశాడు. మొదటి సారి బిగ్ బాస్ చరిత్రలో కామాన్ మ్యాన్ గా టైటిల్ గెలిచి సంచలనం సృష్టించాడు. ఇప్పటి వరకు జరిగిన గత 6 సీజన్స్ లో సెలెబ్రెటీలే విజేతలుగా నిలిచారు. తొలిసారి టైటిల్ గెలుచుకున్న కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ చరిత్రలో సంచలనం సృష్టించాడు. ఒక రైతు బిడ్డగా ఇంట్లోకి అడుగు పెట్టిన కామన్ మ్యాన్ బిగ్ బాస్ టైటిల్ గెలవడం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.

ప్రశాంత్ (Pallavi Prashanth) తెలంగాణలోని సిద్దిపేటలో జన్మించాడు. తన తండ్రి బాటలోనే నడవాలనుకున్న ప్రశాంత్ చదువు తర్వాత వ్యవసాయాన్ని తన వృత్తిగా ఎంచుకున్నాడు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన ప్రశాంత్.. తన ఊరుకు సంబంధించిన వీడియోలు, వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు చేస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందాడు. సీజన్ 4 నుంచి బిగ్ బాస్ కు వెళ్లాలనే కోరికను బలంగా ఏర్పరచుకున్నాడు. బిగ్ బాస్ కు వెళ్లాలనే తన కోరికను తెలియజేస్తూ ఎన్నో వీడియోలు చేశాడు. 3 సంవత్సరాల తర్వాత తన కోరిక ఫలించింది. బిగ్ బాస్ సీజన్ 7 లో కామన్ మ్యాన్ క్యాటగిరీలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే పట్టుదలతో 15 వారల పాటు గేమ్ ఆడిన పల్లవి ప్రశాంత్.. సీజన్ 7 టైటిల్ గెలిచి బిగ్ బాస్ లో చరిత్ర సృష్టించాడు.

Bigg Boss Grand Finale: టాప్ 3 లో శివాజీ ఎలిమినేటెడ్.. విన్నర్ అతడే..! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు