/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Sun-jpg.webp)
Aditya L1 Captures High-Energy Solar Flare: చంద్రయాన్ - 3 (Chandrayaan-3) విజయవంతం కావడంతో భారత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇది సక్సెస్ కావడంతో జోష్ మీదున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) .. సూర్యునిపై పరిశోధనలు చేసేందుకు ఆదిత్య ఎల్1 (Aditya L1) ప్రయోగాన్ని చేపట్టింది. అయితే ఈ ఆదిత్య ఎల్1 వ్యోమనౌక మొదటిసారిగా సౌర జ్వాలలకు సంబంధించి హై ఎనర్జీ ఎక్స్‌రే రే చిత్రాన్ని ఫొటో తీసింది. ఆ వ్యోమనౌకలో ఉన్న 'హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్' (హెచ్‌ఈఎల్1ఓఎస్) ఈ ఘనత సాధించింది. దీనిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మంగళవారం ఓ ప్రకటన చేసింది. సౌర వాతావరణం అకస్మాత్తుగా ప్రకాశవంతంగా అయిపోతే దాన్ని సౌర జ్వాల అని అంటారు. హెచ్‌ఈఎల్1ఓఎస్‌ను (HEL1OS) గత నెల 27న ఇస్రో ఆన్ చేసింది.
Also Read: నిండు సభలో సెక్స్ గురించి మాట్లాడిన నితీశ్ కుమార్!
ప్రస్తుతం ఈ పరికరంతో పూర్తిస్థాయిలో పరిశీలనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది సూర్యనికి సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్‌రే చర్యలను శరవేగంగా పరిశీలన చేసి.. ఎక్కువ రిజల్యూషన్‌లో చిత్రాలను అందిస్తుంది. అయితే తాజాగా సౌర జ్వాలకు సంబంధించి ఇంపల్సన్ దశను నమోదు చేసింది. దీనివల్ల సూర్యునిలో విస్ఫోటక శక్తి విడుదల, ఎలక్ట్రాన్ త్వరణం గురించి మరిన్ని వివరాలు అందుబాటులోకి తెచ్చేందుకు దోహదపడుతుంది. ఈ పరికరాన్ని బెంగళూరోని ఇస్రోకు చెందిన స్పేస్ ఆస్ట్రోమమీ (Space Astronomy) గ్రూప్ అభివృద్ధి చేసింది. ఇదిలా ఉండగా.. ఇస్రో త్వరలోనే భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు గగన్‌యాన్ ప్రాజెక్టు కూడా చేపట్టనున్న విషయం తెలిసిందే.
Aditya-L1 Mission:
HEL1OS captures first High-Energy X-ray glimpse of Solar Flares🔸During its first observation period from approximately 12:00 to 22:00 UT on October 29, 2023, the High Energy L1 Orbiting X-ray Spectrometer (HEL1OS) on board Aditya-L1 has recorded the… pic.twitter.com/X6R9zhdwM5
— ISRO (@isro) November 7, 2023