Aditya L1 Mission: తిరుమలలో ఇస్రో శాస్త్రవేత్తల బృందం.. శ్రీవారి పాదాల చెంత ఆదిత్య L1 నమూనాకు ప్రత్యేక పూజలు!
ఆదిత్య L1 ప్రయోగానికి ముందు తిరుమలకు వెళ్లింది ఇస్రో శాస్త్రవేత్తల బృందం. శ్రీవారి పాదాల చెంత ఆదిత్య L1 నమూనాకు ప్రత్యేక పూజలు చేశారు సైంటిస్టులు. చంద్రయాన్-3 ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు ఇలానే వెళ్లారు. గత జులై 13న నైవేద్య విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల ఆలయాన్ని సందర్శించి స్వామివారి సేవలో పాల్గొన్నారు.