Karnataka: ఇస్రో ఛైర్మన్‌కు కర్ణాటక సర్కార్ ప్రతిష్ఠాత్మక అవార్డు

కర్ణాటక ప్రభుత్వం ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌కు రాజ్యోత్సవ అవార్డును ప్రకటించింది. ఆయనతో సహా 68 మందికి ఈ అవార్డులను అందించనుంది. వివిధ రంగాల్లో విశేష సేవలు చేసిన వారికి కర్ణాటక సర్కార్ ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తోంది. ఈ ఏడాది ఎంపికైన వారిలో 54 మంది పురుషులు, 13 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు.

Karnataka: ఇస్రో ఛైర్మన్‌కు కర్ణాటక సర్కార్ ప్రతిష్ఠాత్మక అవార్డు
New Update

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఛైర్మన్ ఎస్. సొమనాథ్‌కు కర్ణాటక సర్కార్ ప్రతిష్ఠాత్మక అవార్డు ప్రకటించింది. ఆయనకు రాజ్యోత్సవ అవార్డును అందజేయనుంది. ఈ ఏడాదికి సోమనాథ్‌తో సహా మరో 68 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. కర్ణాటక ప్రభుత్వం వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించేవారికి గౌరవ సూచకంగా ప్రతిఏడాది ఈ పురస్కారాలను ప్రదానం చేస్తుంటుంది. కర్ణాటకలో దీన్ని రెండో అత్యున్నత పౌర పురస్కారంగా భావిస్తారు. ఇక నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను అందజేస్తారు.

Also read: ఐటీ ఉద్యోగులకు షాక్.. 52 వేల ఉద్యోగాలు ఔట్

Also Read: ఆ రోజునే ఎథిక్స్ కమిటీ విచారణకు మహువా మొయిత్రా

అయితే ఈ ఏడాది పలు రంగాల్లో విశేష సేవలందించిన 68 మందితో సహా 10 సంస్థలకు కూడా ఈ రాజ్యోత్సవ అవార్డులు ఇవ్వనున్నట్లు కర్ణాటక సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్‌ తంగడగి పేర్కొన్నారు. అలాగే అవార్డు గ్రహీతలను ఎంపిక చేసే సమయంలో ప్రతి జిల్లాకు కూడా ప్రాతినిధ్యం కల్పించామని పేర్కొన్నారు. అయితే ఈ సంవత్సరం రాజ్యోత్సవ పురస్కారాలకు ఎంపికైన వ్యక్తులు, సంస్థల జాబితాలో 13 మంది మహిళలు, 54 మంది పురుషులు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నట్లు వివరించారు. మరో విషయం ఏంటంటే ఈ పౌర పురస్కారం కింద దాదాపు రూ.5లక్షల నగదుతో సహా.. 25 గ్రాముల బంగారు పతకాన్ని అందించనుంది కర్ణాటక ప్రభుత్వం. అయితే ఇటీవల ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 విజవంతం కావడంతో.. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌కు విశేషమైన జనాధారణ లభించింది. ఈ నేపథ్యంలో ఆయన రాజ్యోత్సవ అవార్డుకు ఎంపిక కావడంపై నెటీజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: రక్తం కారుతున్న కత్తితో పోలీస్ స్టేషన్‌కు వ్యక్తి.. అతను చెప్పింది విని పోలీసులు హడల్..

#isro #karnataka-news #national-news #isro-chairman-somanath #telugu-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe