Israel: యెమెన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. యెమెన్‌లో హౌతీల స్థావరాలే లక్ష్యంగా అల్ హొదైదా నౌకాశ్రయంతోపాటు పలు లక్ష్యాలపై ఇజ్రాయిల్ బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో పలువురు మరణించగా.. మరికొంతమందికి గాయాలయ్యాయి. నౌకాశ్రయంలో ఉన్న చమురు నిల్వలకు మంటలు అంటుకున్నాయి. By B Aravind 21 Jul 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి యెమెన్‌లో శనివారం ఇజ్రాయిల్ బాంబులతో విరుచుకుపడింది. హౌతీల స్థావరాలే లక్ష్యంగా పశ్చిమ ప్రాంతంలోని అల్ హొదైదా నౌకాశ్రయంతోపాటు పలు లక్ష్యాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పలువురు మరణించగా.. మరికొంతమందికి గాయాలయ్యాయి. నౌకాశ్రయంలో ఉన్న చమురు నిల్వలకు మంటలు అంటుకున్నాయి. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. శుక్రవారం టెల్ అవీవ్‌పై హౌతీలు డ్రోన్ దాడి చేసినందుకు ప్రతీకారంగా ఈ దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. Also Read: పెన్సిల్వేనియాలో ఆశ్చర్య గొలిపే ఘోస్ట్ సిటీ.. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత యెమెన్‌లో హౌతీలు లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబులతో దాడులు చేయడం ఇదే మొదటిసారి. హౌతీలకు గట్టి పట్టున్న నగరం అల్ హొదైదా. ఈ ప్రాంతంలో ఉండే పోర్టు వారికి ఎంతో ముఖ్యమైనది. ఈ నగరంలోనే పోర్టు, చమురు నిల్వ కేంద్రం, విద్యు్త్ కేంద్రంపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. గాజా ప్రజలకు తాము మద్దతు ఇవ్వకుండా అడ్డుకునేందుకే ఇజ్రాయెల్ తమపై దాడులకు పాల్పడిందని హౌతీల అధికార ప్రతనిధి అబ్దుల్ సలాం అన్నారు. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ మూడు వేరు వేరు వైమానికి దాడులు చేసింది. ఈ దాడుల్లో 13 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. వీళ్లలో ఓ మహిళ, ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. నుసీరత్, బ్యూరిజ్ శరణార్థి శిబిరాలపై ఈ దాడులు జరిగాయి. నుసీరత్ శిబిరంలో ఓ 25 ఏళ్ల గర్భిణి ప్రాణాలు కోల్పోయారు. ఆమెకు శస్త్ర చికిత్స చేసి గర్భంలో నుంచి శిశువును ఆసుపత్రి వైద్యులు సురక్షితంగా బయటకు తీశారు. మగబిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అలాగే శిశువు తండ్రి ఇజ్రాయెల్ దాడిలో గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉంది. Also Read: ఆశ్చర్యం.. పుట్టుకతోనే చిన్నారికి 32 రెండు పళ్లు.. #telugu-news #israel #israel-attack #yemen మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి