Israel-Hamas war:ఒప్పందం ముగిసింది..మళ్ళీ కాల్పులు మొదలయ్యాయి

ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పదం ముగిసిపోయింది. అది అయిన క్షణాల్లోనే ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టేసింది. ఈరోజు దాడిలో  నలుగురు చిన్నారులు, మరో ఐదుగురు పాలస్తీనియన్లు చనిపోయారు. 

Israel-Hamas war:ఒప్పందం ముగిసింది..మళ్ళీ కాల్పులు మొదలయ్యాయి
New Update

అమెరికా, ఖతార్‌ల శ్రమ అయిపోయింది. కష్టపడి వారం రోజుల పాటూ ఇజ్రాయెల్-హమాస్ దాడుల మధ్య యుద్ధాన్ని ఆపగలిగారు కానీ అంతకు మించి పొడిగించలేకపోయారు. నాలుగు రోజులకు చేసుకున్న తాత్కాలిక ఒప్పందం వారం రోజులకు పొడిగించారు. అది ఈరోజుతో అయిపోయింది. అది అలా ముగిసింది..ఇజ్రాయెల్ కాల్పులు మొదలెట్టేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని.. ఈ నేపథ్యంలో యుద్ధం మళ్లీ ప్రారంభమైందని పేర్కొన్నారు. కాగా యుద్ధం పునః ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే మరణాలు నమోదైయ్యాయి అని పాలస్తీనా ఆరోగ్య శాఖా అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మాధ్యమాల సమాచారం ప్రకారం.. ఇరుదేశాల మధ్య సంధి ముగిసిన మొదటి 90 నిమిషాలలో ఆటోమేటిక్ ఆయుధాలు కాల్పుల వర్షాన్ని కురిపించాయి.

Also Read:ఎన్నికల కంటే సినిమా ముఖ్యమైపోయిందా..ఏంటి రా ఈ దారుణం?

వారం రోజులుగా ప్రశాంతంగా ఊపిరిపీల్చుకుంటున్న గాజావాసులు కాల్పుల మోతతో ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. మళ్ళీ ఎలా బతకాలి..ఎక్కడికి పారిపోవాలి అని పాలస్తీనియన్లు ఆలోచనలో పడ్డారు. హమాస్ లక్ష్యాల మీద ఫైటర్ జెట్‌లు దాడి చేస్తున్నాయని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దాంతో పాటూ దక్షిణ గాజా లోని రఫా లోని అల్-నజర్ ఆసుపత్రి డైరెక్టర్ మార్వాన్ అల్-హమ్స్, ఇజ్రాయెల్ ఉత్తర భూభాగాన్ని విడిచిపెట్టమని హెచ్చరించారు. దీనితో చాలా మంది పాలస్తీనియన్లు అక్కడి నుండి పారిపోయారు. కాగా ఈ దాడుల్లో మొదటి 60 నిమిషాల్లో నలుగురు చిన్నారులతో పాటుగా మొత్తం 9 మంది మరణించారు. ఈ నేపథ్యంలో పాఠశాలలను మూసివేయడంతో సహా ఆ ప్రాంతంలో భద్రతా చర్యలను పునఃప్రారంభిస్తున్నట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.

తమ మధ్య ఒప్పందాన్ని పొడిగించాలని హమాస్..ఇజ్రాయెల్ ను కోరింది. బందీలు, ఖైదీల మార్పిడి కోసం సంధిని మరింత పొడిగించేందుకు హమాస్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పౌరుల కోసం ఇజ్రాయెల్ సేఫ్ జోన్‌లను ఏర్పాటు చేయాలని కోరింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం దీన్ని పెడచెవిన పెట్టింది.

#war #israel #hamas #usa #khatar
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe