Israel-Hamas war:ఇజ్రాయెల్ సైన్యం పొరపాటున బందీలను చంపేసింది-ప్రధాని నెతన్యాహు

ఏం జరిగినా...ఎవ్వరిడగినా...ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ మీద దాడులు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో హమాస్ దగ్గర బందీలుగా ఉన్న ముగ్గురిని ఇజ్రాయెల్ సైన్యం చంపేయడం ఇప్పుడు చర్చనీయంగా మారింది.

Israel-Hamas war:ఇజ్రాయెల్ సైన్యం పొరపాటున బందీలను చంపేసింది-ప్రధాని నెతన్యాహు
New Update

హమాస్ దగ్గర బందీలను ఇజ్రాయెల్ సైన్యమే చంపడం ఇప్పుడు కలకలం రేగుతోంది. ఇది అనుకోకుండా జరిగింది...విషాదకర సంఘటన అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పినప్పటికీ ఇజ్రాయెల్ ప్రజలు దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాజాలోని టెల్ అవీవ్ లోని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం బయట ప్రదర్శనలు చేశారు.

Also read:ధోనీ వర్సెస్‌ రోహిత్‌ ఎపిక్‌ క్లాష్‌కి ఎండ్‌కార్డ్.. ఫ్యాన్స్‌ ఎమోషనల్‌!

ఏది ఏమైనా హమాస్‌ను పూర్తిగా తుదముట్టించేవరకు తాము యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ వార్ మొదలై ఇప్పటికి 71 రోజులు గడిచింది. దీనివలన గాజాలో 85శాతం మంది ప్రజలు నిరాశ్రయులైయ్యారు. యుద్ధం మాయవినాశనానికి దారి తీస్తోందని ఐరాస మొత్తుకుంటోంది. దీని కోసం తీర్మానాలను ప్రవేశపెడుతోంది. అన్ని దేశాలు కూడా దీనికి మద్దతునిస్తున్నాయి. అమెరికా కూడా కొన్ని షరతులతో తీర్మానానికి ఆమోదం తెలిపింది. కాల్పుల విరమణ డిమాండ్ ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ దాన్ని పట్టించుకోకపోవడం మీద ఐరాస ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ చట్టాలను ఆదేశం ఉల్లంఘిస్తోందని అంటోంది.

మరోవైపు తాము గాజాలో ప్రజలకు మానవసహాయం అందిస్తున్నామని తెలిపింది ఇజ్రాయెల్. తమ భూభాగం ద్వారా అవి వెళుతున్నాయని తెలిపింది. యుద్ధం మొదలైన తర్వాత పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ సహాయం చేయడం ఇదే మొదటిసారి. దీంతో పాటూ సామస్య ప్రజలకు భద్రత కలిగించడం మీద కూడా అమెరికా ఎన్ఎస్ఏ...ఇజ్రాయెల్ అధికారులతో మాట్లాడుతోంది.

#israel #hamas #war #benjamin-netanyahu #prmie-minister
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe