Gaza: గాజాలో దాడులు తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రధానికి జైశంకర్ ఫోన్.. గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను ఆపాలని ఐక్యరాజ్యసమితిలో యూఏఈ తీర్మానం ప్రవేశపెట్టగా దీనికి అమెరికా తన వీటో అధికారాన్ని వినియోగించి అడ్డుకుంది. దీంతో గాజాలో ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రతరం అయ్యాయి. దీంతో అక్కడ ఆశ్రయం కోసం వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. By B Aravind 10 Dec 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇటీవల కాల్పుల విరమణ ప్రకటించి బంధీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత మళ్లీ కాల్పులు చెలరేగాయి. అయితే తాజాగా గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఆపాలని ఐక్యరాజ్య సమితిలో ఈఏఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. అమెరికా తన వీటో అధికారాన్ని వినియోగించి దీన్ని తిరస్కరించింది. దీంతో ఇజ్రాయెల్ దళాలు గాజాపై తమ దాడులను మరింత తీవ్రతరం చేశాయి. ఆదివారం ఉదయం దక్షణ గాజాలోని ఖాన్ యునిస్ నగరం నుంచి ఈజిప్టు సరిహద్దుల్లో రఫా నగరానికి వెళ్లే రహదారులను లక్ష్యంగా చేసుకొని బాంబు దాడులు జరిగినట్లు హమాస్ పేర్కొంది. ఆ ప్రాంతంలో దాడులు తీవ్రతరం కావడంతో.. ఆశ్రయం కోసం వేలాది మంది ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మానవతా సాయం అందకపోతే అనేకమంది సామాన్య పౌరులు ఆకలి, ఇతర వ్యాధులతో చనిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సహాయక బృందాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశాయి. Also Read: కరీంనగర్ పార్లమెంట్ పై ‘బండి’ గురి.. రోడ్ మ్యాప్ రెడీ! మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా 17,700 మంది పాలస్తీనా వాసులు మృతి చెందారు. అయితే వీళ్లలో 40 శాతం మంది 18 ఏళ్లలోపు ఉన్నవారే ఉన్నారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ శనివారం రాత్రి పాలస్తీనా ప్రధానమంత్రి మహమ్మద్ ష్టయ్యేహ్‌తో ఫోన్‌లో సంభాషించారు. ఈ విషయానికి సంబంధించి ఆయన ట్వీట్ కూడా చేశారు. పాలస్తీనా ప్రధానితో మాట్లాడానని.. గాజా, వెస్ట్ బ్యాంక్‌లో ఉన్న పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. పాలస్తీనాపై భారత్ దీర్ఘకాలిక వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసినట్లు రాసుకొచ్చారు. Also Read: సీఎం క్యాంప్ ఆఫీస్ మార్పు!.. MCRHRDకి తరలింపు #telugu-news #gaza #hamas-vs-israel #hamas-israel-war #jai-shankar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి