/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/House-Destroy-jpg.webp)
Israel-Hamas War: హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా గాజా (Gaza) పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హమాస్ ఉగ్రసంస్థకు చెందిన ముఖ్య నేత.. హమాస్ రాజకీయ అధిపతిగా పేరున్న ఇస్మాయిల్ హనియా (Ismail Haniyeh) ఇంటిని ఇజ్రాయెల్ భద్రతా బలగాలు నేలమట్టం చేశాయి. ఆయన ఇంటిపై ఫైటర్ జెట్లతో బాంబుల వర్షం కురిపించిన ఐడీఎఫ్.. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా తమ అధికారక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసింది. ఇస్మాయిల్ హనియా ఇల్లు అనేది హమాస్ ఉగ్రకార్యకలాపాలకు నిలయంగా మారిపోయిందంటూ ఇజ్రాయెల్ భద్రతా బలగాలు ఆరోపిస్తున్నాయి. హమాస్ సీనియర్ నేతలు, వ్యూహకర్తలు ఇతడి ఇంట్లోనే సమావేశమై.. ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు ప్రణాళికలు వేసినట్లు చెబుతోంది.
Also Read: రాత్రంతా మేల్కొని మరీ మ్యాచ్ ని ఎంజాయ్ చేశా: సత్య నాదెళ్ల!
తాజా దాడిలో ఇస్మాయిల్ హనియా ఇల్లు పూర్తిగా నేలమట్టమైనట్లు తెలుస్తోంది. అయితే, దాడి సమయంలో ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు. హనియా పేరు తొలిసారిగా 1990లో వెలుగులోకి వచ్చింది. హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్‌కు (Ahmed Yasin) ఇతడు అత్యంత సన్నిహితుడు. రాజకీయపరమైన సలహాలిస్తూ ఆయనకు కుడి భుజంగా మారాడు. 2004లో ఇజ్రాయెల్ దాడుల్లో అహ్మద్ యాసిన్ హతమైన తర్వాత.. హమాస్‌లో కీలక పాత్ర పోషించాడు. ఇదిలాఉండగా.. గురువారం జరిగన దాడుల్లో ఇస్మాయిల్ ఇంటితో సహా.. హమాస్‌కు నౌకదళానికి చేందిన పలు ఆయుధాలను కూడా ధ్వంసం చేసింది.
חטיבת האש 215 באוגדה 162 תקפה הלילה באמצעות מטוסי קרב את ביתו של איסמעיל הנייה, ראש הלשכה המדינית של ארגון הטרור חמאס ששימש כתשתית טרור ובין היתר כמקום מפגש עבור בכירי הארגון>> pic.twitter.com/eCwd4lmrFF
— צבא ההגנה לישראל (@idfonline) November 16, 2023
Also read: బాగానే మాట్లాడుకున్నారుగా..మళ్ళీ ఈ ట్యాగ్ లేంటి బైడెన్?