Israel attcks:ఉత్తర గాజాలో ఇండోనేషియన్ ఆసుపత్రిని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ గాజాలో అల్ షిఫా ఆసుపత్రిని పూర్తిగా స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు మరో ఆసుపత్రి మీద దాడికి రెడీ అయింది. ఉత్తర గాజాలోని ఇండోనేషియన్ హాస్పటల్ ను లక్ష్యంగా చేసుకుంది. By Manogna alamuru 21 Nov 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి గాజాలోనే అతి పెద్ద ఆసుపత్రి అల్ షిఫా. దీని మీద చాలా రోజులు దాడులు చేసింది ఇజ్రాయెల్ సైన్యం. అనుకున్నట్టుగానే దాన్ని స్వాధీనం కూడా చేసుకుంది. ఆసుపత్రిని దిగ్బంధించి, రోజుల తరబడి తనిఖీలు చేస్తూ హమాస్ ఆయుధాలు, సొరంగాల ఫొటోలు విడుదలను కూడా చేసింది. మొదట నుంచి గాజాలో ఆసుపత్రులను హమాస్ తమ రహస్య స్థావరాలుగా వినియోగించుకుంటోంది అని ఇజ్రాయెల్ ఆరోపిస్తూనే ఉంది. చివరకు అదే నిజమైంది కూడా. అందుకే ఇప్పుడు ఉత్తర గాజాలో మరో ముఖ్యమైన హాస్పటల్ ఇండేనేషియన్ మీద పడింది. దీన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని ప్లాన్ చేస్తోంది. అల్ షిఫా లాగే ఇక్కడకు పెద్ద సంఖ్యలో రోగులు, క్షతగాత్రులు, వేలాది మంది సామాన్య పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నారు. అయినా సరే తమ టార్గెట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతోంది. నిన్న క్షిపణులు ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా ఇండోనేసియన్ ఆసుపత్రిపై క్షిపణులు ప్రయోగించింది. Also Read:నవంబర్ 23 తర్వాత ప్రచార హోరుతో దద్దరిల్లనున్న తెలంగాణ ఆసుపత్రి మీద ఇజ్రాయెల్ ప్రయోగించిన క్షిపణుల వల్ల భవనం రెండో అంతస్థు కూలిపోయింది. కనీసం 12 మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ చెబుతోంది. మరోవైపు ఇండోనేషియన్ హాస్పిటల్‌కు 200 మీటర్ల దూరంలో ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులను కూడా మోహరించింది. ఆసుపత్రి దగ్గరలోని భవనాలపై ఇజ్రాయెల్ షార్ప్ షూటర్లు కూడా మాటు వేశారు. ఎవరెన్ని చెప్పినా ఆసుపత్రుల్లో హమాస్ స్థావరాలు, ఆయుధ నిల్వలు ఉన్నాయని, వాటిని ధ్వంసం చేయక తప్పదని ఇజ్రాయెల్ అంటోంది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో మృతుల సంఖ్య 13,000కు చేరిందని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే అల్ షిఫా నుంచి తరలించిన 31 మంది చిన్నపిల్లల్లో 28మందిని దక్షిణ గాజాలోని అల్ అహ్లీ ఎమిరేట్స్ హాస్పిటల్ నుంచి ఆంబులెన్స్ ల్లో ఈజిప్టుకు చేర్చారు. ఈజిప్టులోని వైద్యులు పిల్లలను ఇంక్యుబేటర్లలో ఉంచఇ వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. Footage shows the moment Israeli strikes hit a street just outside Gaza’s Indonesian Hospital, where many Palestinians receive treatment. Palestinian civilians can be seen taking shelter to protect themselves pic.twitter.com/k6CpXIn89J — TRT World (@trtworld) November 9, 2023 #israel #hamas #gaza #attacks మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి