పాక్ ఆక్రమిత కాశ్మీరులో ఉగ్రవాదులకు ఐఎస్ఐ అత్యంత అధునాతన ఆయుధాలను సప్లై చేస్తోందని భారత నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నారు. వాటితో పాటూ డిజిటల్ మ్యాప్ లు, నేవిగేషన్ వ్యవస్థలను కూడా ఇస్తోందని తెలిపారు. భారత్ లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు ఇంతకు ముందు నుంచే హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో భారత భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు ముష్కరుల ప్రయత్నాలను భగ్నం చేస్తూనే ఉన్నాయి కూడా. రీసెంట్ గా ఓ లష్కరే తోయిబా ఉగ్రవాది గుర్తు తెలియని దుండగుల చేతిలో మరణించాడు. దీనికి ప్రతీకారంగా లష్కరే తోయిబా అనంత్ నాగ్ లో దాడులు జరపగా అందులో ఇద్దరు సైనికాధికారులు, ఓ డీఎస్పీ మృతి చెందారు.
ఇప్పుడు మళ్ళీ ఉగ్రవాద కార్యకలాపాలు ముమ్మరం అవుతున్నాయని నిఘగా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ముష్కరులకు ఐఎస్ఐ అధునాతన పిస్తోళ్ళు, గ్రనేడ్లు లాంటి ఆయుధాలు, నైట్ విజన్ లాంటి అధునాతన పరికరాలను ఉగ్రవాదులకు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. వీటిని చైనీస్ డ్రోన్ల సహాయంతో పీవోకే కి తరలిస్తున్నట్లు సమాచారం. వీటితో పాటూ డిజిటల్ మ్యాప్ లు, నేవిగేషన్ సిస్టమ్స్, భారత నిఘా వర్గాలకు చిక్కకుండా అత్యాధునిక ఎన్ క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ను కూడా ఉగ్రవాదులకు అందజేస్తోంది ఐఎస్ఐ. దీని మీదనే భారత దర్యాప్తు సంస్థలను నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.